Sr Kalyanamandapam: ఆఫర్ల కోసం అందాలు ఆరబోస్తున్న తెలుగు హీరోయిన్?

Sr Kalyanamandapam:

టాలీవుడ్ లో తెలుగమ్మాయి ల కొరత చాలా ఏళ్ళ నుండి ఉందని తెలిసిందే. అయితే కొందరు హీరోయిన్లు తమ టాలెంట్ ని నమ్ముకుని వచ్చినా కూడా అనుకున్న అవకాశాలు రావడం లేదు. పెద్ద సినిమాల్లో సైడ్ రోల్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న తెలుగమ్మాయిల్లో అంజలి కాస్త బెటర్. స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా అయినా అవకాశాలొస్తున్నాయి. మిగతా వారికీ అదీ లేదు.

ఇక ఇషా రెబ్బ, ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ళు ముందు నుండే తెలుసుకున్నారు కాబట్టే, బయట ఇండస్ట్రీల్లోనూ సినిమాలు చేస్తున్నారు. అయితే వీళ్ళ లాగే టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. టాక్సీవాలా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టడమే కాక గ్లామర్ హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. పైగా ఇప్పుడు ఉన్న తెలుగు హీరోయిన్లలో మంచి గ్లామర్ ఉన్న హీరోయిన్ ప్రియాంక. కానీ కాలం కలిసిరాకో లేక అదృష్టం తలుపుతట్టలేదో ఛాన్స్ లు మాత్రం రావట్లేదు.

రెండేళ్ల కిందట వచ్చిన ఎస్ ఆర్ కల్యాణ మండపం ఆమె లాస్ట్ సినిమా. ఇప్పటివరకు మరో ఆఫర్ రాలేదు. అందుకే గత ఏడాది నుండి గ్లామర్ ఫోటోషూట్లు విపరీతంగా చేస్తూ ఫొటోలకి ఫోజులిస్తుంది. ఆమె ఇన్స్టా పోస్టులైతే దాదాపు సంవత్సరం నుండి గ్లామర్ షో చేసిన ఫొటోలే ఉన్నాయి. తాజాగా జీన్స్ లో డ్రెస్ లో మరో ఫోటో షూట్ చేసింది. అయితే ఇదంతా ఛాన్సుల కోసమే అని తెలుస్తూనే ఉంది. మరి ఇప్పటికైనా దర్శక నిర్మాతలు గమనించి అన్ని అర్హతలు ఉన్న ఈ తెలుగమ్మాయికి అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు