Circle: ఆరేళ్ళకి రీ ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు కూడా నిరాశే

టాలీవుడ్ లో ఏ హీరోయిన్ అయినా, ఎంత టాలెంట్ ఉన్నా హిట్ ఉంటేనే నిలదొక్కుకోగలదు. కొంతమంది హీరోయిన్లకు హిట్ లేకున్నా గ్లామర్ షో చేసే పాత్రలు వస్తాయి. మరి కొంతమంది హిట్స్ రాకపోతే సైడ్ రోల్స్ కి పరిమితమవుతారు. కానీ చాలా తక్కువ మంది హిట్ చిత్రాలు లేకపోయినా ఓపికతో కొత్త సినిమాలకోసం ఎదురుచూస్తారు. ఎదో ఒక విధంగా తమ టాలెంట్ చూపించి హిట్ సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు “రిచాపనయ్”.

లక్నో కి చెందిన ఈ క్యూట్ హీరోయిన్ అల్లరి నరేష్ నటించిన “యముడికి మొగుడు” సినిమాతో హీరోయిన్ గా ప్రవేశించింది. ఆ సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో చక్కగా ఆకట్టుకుంది. అయినప్పటికీ ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. చందమామ కథలు, ఈడు గోల్డ్ ఎహే వంటి చిత్రాల్లో సెకండ్ లీడ్ గా నటించింది. అయినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దాంతో అవకాశాలు లేకుండా పోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆరేళ్ళ గ్యాప్ తీసుకుని ఈ భామ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

సాయి రోనాక్ హీరోగా నటించిన “సర్కిల్” అనే సినిమాలో రిచా పనయ్ హీరోయిన్ గా నటించింది. తాజాగా విడుదలైన ఈ సినిమా కూడా రొటీన్ టాక్ తెచ్చుకుంది. సినిమాకి ప్రమోషన్లు కూడా పెద్దగా చేయకపోవడంతో జనాలకి అసలు ఈ సినిమా వచ్చిందనే సంగతి కూడా తెలియదు. దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. రిచా పనయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. మరి ఇప్పుడు కూడా ఆఫర్ల కోసం ఎదురు చూస్తుందా లేక సైడ్ రోల్స్ వచ్చినా చేస్తుందా చూడాలి.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు