Ganavi Laxman: రుద్రంగి లో ఆ ఇద్దరికంటే ఈ హీరోయిన్ కే ఎక్కువట!

టాలీవుడ్ లో తెలంగాణ నేపథ్యంలో ఇప్పుడు చాలా సినిమాలొస్తున్నాయి,. అందులో అన్నీ ఇప్పటికాలానికి ఉద్దేశించే వస్తున్నా, నిజాం భూస్వాముల కాలం నాటికి సంబంధించిన కథతో వచ్చిన తాజా చిత్రం “రుద్రంగి”. ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా జగపతి బాబు నెగిటివ్ పాత్రలో నటించగా, ఆశిష్ గాంధీ హీరోగా నటించాడు. అయితే ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించడం జరిగింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ల పెర్ఫార్మన్స్ చాలా హైలెట్ గా నిలిచింది. రుద్రంగి సినిమాలో హీరోయిన్లు గా సీనియర్ హీరోయిన్లు విమల రామన్, మమతా మోహన్ దాస్ నటించడం జరిగింది. వీరితో పాటే మరో యంగ్ హీరోయిన్ గణవి లక్ష్మణ్ కూడా నటించింది. వీరి ముగ్గురి రోల్స్ సినిమాలో విభిన్నంగా ఉన్నాయని సినిమా చుసిన నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఉన్న సీనియర్ హీరోయిన్లకంటే యంగ్ హీరోయిన్ గణవి లక్ష్మణ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న రోల్ లభించిందని అంటున్నారు. పైగా టైటిల్ రోల్ కూడా ఈ హీరోయిన్ దేనని అంటున్నారు.

కన్నడ వేద సినిమాలో అద్భుతమైన రోల్ చేసిన గణవి లక్ష్మణ్ కి తెలుగులో కూడా మంచి రోల్ దొరికిందని చెప్పవచ్చు. అయితే రుద్రంగి సినిమా ఆడియన్స్ నుండి కొంచెం నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా అంతగా ఆడకపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ గణవి లక్ష్మణ్ కి తెలుగులో మంచి పాత్రలు దక్కే ఛాన్స్ ఉంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు