Kollywood: చియాన్ విక్రమ్ “తంగలాన్” రిలీజ్ డేట్ ఫిక్స్!

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ‘పొన్నియిన్ సెల్వన్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో తన వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీ గా ఉన్నాడు. ఇక విక్రమ్ నటించిన ‘ధ్రువ నక్షత్రం’ కూడా చాలా వాయిదాల అనంతరం రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పుడు విక్రమ్ నటించిన మరో సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతుంది.

పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న “తంగలాన్” సినిమా లాస్ట్ ఇయర్ మొదలవగా, నాలుగు నెలల కిందట షూటింగ్ లో విక్రమ్ కి జరిగిన ప్రమాదం కారణంగా ఆగిపోయిన ఈ సినిమా, తిరిగి షూటింగ్ పూర్తి చేసుకుని ఏకంగా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించింది.

నవంబర్ 1న టీజర్ రిలీజ్ అవుతుందని ప్రకటించిన మేకర్స్, ఆ పోస్టర్ లోనే తంగలాన్ చిత్రం 2024 జనవరి 26న రిలీజ్ అవుతుందని ప్రకటించడం జరిగింది. ఇక జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో పార్వతి తిరువోతు, పశుపతి, డేనియల్ కాల్టా గిరోన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ తోనే మంచి బజ్ ఏర్పడ్డ “తంగలాన్” రిలీజ్ తరువాత ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -

ఈ లోపు విక్రమ్ నటించిన ధ్రువ నక్షత్రం నవంబర్ 24న రిలీజ్ అవుతుంది. ఇలా రెండు నెలల గ్యాప్ లో విక్రమ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు