Sithara Entertainments: పరభాష హీరోలపై అంత మోజు ఎందుకు?

తెలుగు ఇండస్ట్రీ ఘనత ఎల్లలు దాటుతుంది. అట్టడుగు స్థానం నుంచి ఆస్కార్ తీసుకునే స్థాయి వరకు వెళ్లింది. టాలీవుడా అది ఎక్కడ ఉంది అనే వాళ్ల నుంచే టాలీవుడ్ వైభవం గురించి చెప్పే స్టేజ్ వరకు వెళ్లింది. ఇక తెలుగులో వచ్చే సినిమాలకు హాలీవుడ్ నుంచి కూడా ఎదురుచూపులు ఉంటున్నాయి. ఇలాంటి టైంలో తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని హాలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్లు గానీ, ప్రొడ్యూసర్లు గానీ క్యూ కడుతున్నారు.

కానీ, మన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మాత్రం పరభాష హీరోల మోజులో పడ్డారు. కెరీర్ లో ఒకసారి ఇతర భాషల హీరోలతో సినిమా చేయడం పర్లేదు. కానీ పని గట్టుకుని వరుసగా, ఇతర భాషల్లో హీరోలను ఒప్పించి మరీ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు సితార ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్లు. బ్యాక్ టూ బ్యాక్ పరభాష హీరోలతో సినిమాలు చేస్తున్నారు.

ఇప్పటికే తమిళ హీరో ధనుష్‌తో వాతి సినిమా చేశారు. ఇప్పుడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా బోయపాటి శ్రీను, తమిళ హీరో సూర్య కాంబినేషన్ లో రాబోయే సినిమాను కూడా సితార వాళ్లే తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అలాగే మరో తమిళ హీరో కార్తీతో సినిమా చేయడానికి సితార వాళ్లు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు.

- Advertisement -

త్వరలోనే కార్తీతో కూడా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మొత్తం పరభాష హీరోలతోనే కాలం గడిపేస్తుంది. దీనిపై తెలుగు ఆడియన్స్ నుంచి ట్రోల్స్ వస్తున్నాయి. తెలుగులో గ్లోబల్ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగలిగే సత్తా ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. వాళ్లని కాకుండా, ఇలా పరభాష హీరోలనే ఎందుకు తీసుకుంటున్నారు అంటూ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగ వంశీని ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు