Kamal Haasan: ఒక ప్లానింగ్ , ఒక పద్ధతి , ఒక విజన్

ఉలగనాయగన్ కమల్ హాసన్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2018 తరువాత 2022 వరకు  సినిమాలకి కొంతకాలం గ్యాప్ ఇచ్చిన కమలహాసన్ విక్రమ్ సినిమాతో  బీభత్సమైన హిట్ అందుకున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా కమల్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టింది.
తమిళ్ సినిమా చరిత్రలో అత్యధిక కలక్షన్స్ రాబట్టింది విక్రమ్ సినిమా.
సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చిన కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు కమలహాసన్.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఉలగనాయగన్
కమల్ హాసన్ చేస్తున్న డైరెక్టర్స్ లిస్ట్. తన తరువాత సినిమా లైనప్స్ ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం శంకర్ తో ఇండియన్-2 సినిమా చేస్తున్న కమల్ తన తరువాత సినిమాను మణిరత్నం చేయనున్నారు. ఇదివరకే మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన నాయకుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్స్ అన్నిటితో పాటు కమల్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ప్రాజెక్ట్ కె” కూడా ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మొత్తానికి దాదాపు ఒక ఐదేళ్లు కు సరిపడా లైనప్ ను సిద్ధం చేసారు కమల్ హాసన్. ఈ లైనప్ చూస్తుంటే
“ఒక ప్లానింగ్ , ఒక పద్ధతి , ఒక విజన్” అని అనాలనిపిస్తుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు