Kamal Haasan’s KH234: నాయకుడు కాంబోలో దళపతి కూడానా – అరాచకమే..!

Kamal Haasan’s KH234

క్లాసిక్ కాంబినేషన్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్లో ఒక సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తోడవ్వనున్నాడని టాక్ వినిపిస్తోంది.తన విలక్షణ నటనతో ఎన్నో సినిమాల ద్వారా అలరించిన కమల్, ఏడు పదుల వయసులో కూడా యువ హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు.

గత సంవత్సరం వచ్చిన విక్రమ్ సినిమా ద్వారా తనలోని నటుణ్ని మరోసారి పరిచయం చేశారు. ప్రస్తుతం విక్రమ్ సినిమాకు సీక్వెల్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న కమల్ ఈ గ్యాప్ లో సీనియర్ డైరెక్టర్ మణిరత్నంతో ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేని సూపర్ స్టార్ రీసెంట్ గా జైలర్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న నేపథ్యంలో ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ సినిమాపై హైప్ పెంచుతోంది.

అనౌన్స్మెంట్ కి ముందే హీట్ పెంచుతున్న ఈ కాంబినేషన్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా విక్రమ్, సూర్య, కార్తీ కూడా గెస్ట్ రోల్స్ కనిపిస్తారని టాక్ వస్తున్న నేపథ్యంలో అన్నీ సవ్యంగా సాగితే ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేక స్తానంలో నిలిచే అవకాశం ఉంది.

- Advertisement -

ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేక సతమతం అవుతున్న మణిరత్నం కమల్ హాసన్ తో చేసే సినిమా ద్వారా అయినా తన సత్తా చాటుతాడని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యం వల్ల మణిరత్నం ఇబ్బంది పడుతున్న కారణంగా ఇదే చివరి సినిమా అవుతుందంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో విక్రమ్, జైలర్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకొని ట్రాక్ లో పడ్డ కమల్,రజనీ లతో చేసే సినిమా ద్వారా  గ్రాండ్ రిటైర్ మెంట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు