Kamal Haasan Indian2: ఇండియన్2 కి కూడా సీక్వెల్ ఉంటుందా..?

Kamal Haasan Indian2

దర్శకుడు శంకర్, కమల్ హాసన్ ( Kamal Haasan ) కాంబినేషన్లో ఇండియన్2 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 20ఏళ్ళ కిందట వచ్చిన భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్. చాలా కాలం కిందట షూటింగ్ మొదలైనప్పటికీ ఈ సినిమా వివిధ కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ డిలే అయ్యింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను 2024 సమ్మర్ కి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. షూటింగ్ చాలావరకు పూర్తయినప్పటికీ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ లేకపోవటంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో ఇండియన్2 గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఇండియన్2 కి కూడా సీక్వెల్ ఉంటుందంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 6గంటల ఫుటేజ్ వచ్చిందని, ఆ మొత్తాన్ని ఎడిట్ చేసి సింగిల్ పార్ట్ గా రిలీజ్ చేయటం కష్టమని భావించిన మేకర్స్ రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇండియన్2 ఎండింగ్ లో ఇండియన్3 కి సంబందించిన హింట్ ఇస్తారని అంటున్నారు.

ఇండియన్ 3కి సంబంధించి ఇప్పటికే 75శాతం సీన్స్ రెడీగా ఇంకా కొన్ని సీన్స్ యాడ్ చేసి ఇండియన్3 ని రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలన్న కసితో ఉన్నాడు దర్శకుడు శంకర్. అయితే, ఈ సినిమా మీద ఎక్కువ దృష్టి పెడుతున్న శంకర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను నిర్లక్ష్యం చేస్తున్నాడని మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు