Pawan kalyan: అతని గురించి స్టేజ్ పైనే మాట్లాడాలనుకుంటున్న- పవన్ కళ్యాణ్ మాజీ భార్య వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడాకులు తీసుకొని చాలా కాలం అయినప్పటికీ కూడా పవన్ భార్యల ప్రస్తావన వస్తే ముందుగా వినిపించేది రేణు దేశాయ్ పేరు మాత్రమే. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఇప్పటికి కూడా రేణు దేశాయ్ ను పవన్ భార్య క్రిందనే లెక్క చేస్తారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా కారణంగా తరుచుగా వార్తలలో నిలుస్తూ వస్తున్న రేణు దేశాయ్ ఈరోజు కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాగా ఆ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవే అయ్యుంటాయని ఆయన అభిమానులు నెట్ లో వైరల్ చేస్తున్నారు. మరి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యల విషయానికొస్తే “ఆయన చాలా కష్టపడ్డాడు.. ఆయన గురించి మాట్లాడాల్సిన విషయాలు కూడా చాలానే ఉన్నాయి. అవన్నీస్టేజ్ పైనే మాట్లాడాలనుకుంటున్నా” అని రేణు దేశాయ్ స్టేట్మెంట్ ఇచ్చింది.

అయితే నిజానికి రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసినవి ఏమాత్రం కాదని తెలుస్తుంది. రేణు దేశాయ్ లేటెస్ట్ గా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాలో ప్రముఖ పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా దసరా కానుకగా మరో వారం రోజుల్లో రిలీజ్ అవబోతుండగా రవితేజ గురించి మాట్లాడాలనే తన ఉద్దేశ్యాన్ని ఇంటర్వ్యూలో తెలుపగా ఆ వ్యాఖ్యలను ఆమె పవన్ ను టార్గెట్ చేస్తూ చేసిందని కొంతమంది నెట్ లో వైరల్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు