Tiger Nageswararao:టైగర్ కి రిలీజ్ డేటే శాపమయ్యిందా..?

మాస్ మహారాజ రవితేజ హీరోగా స్టూవర్ట్ పురం గజదొంగ నాగేశ్వరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. అక్టోబర్ 20న రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో అంచనాలు కూడా తారాస్థాయిలో నెలకొన్నాయి.

రావణాసుర లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా హిట్ అవ్వటం రవితేజకి కీలకంగా మారింది. టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ సొంతం చేసుకున్నప్పటికీ టైగర్ నాగేశ్వరరావుకి బాక్సాఫీస్ వద్ద కష్టాలు తప్పేలా లేవు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమాకి ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు స్టేట్స్ లో కూడా ఆశించిన స్థాయిలో థియేటర్స్ దక్కలేదు.

రవితేజ సినిమా, పైగా టైగర్ నాగేశ్వరావు లాంటి క్రేజీ సినిమాకి థియేటర్స్ దొరకకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అవుతున్న డేటే అందుకు కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే అక్టోబర్ 19న బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన భగవంత్ కేసరి, లోకేష్ కనగరాజ్, తలపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన లియో సినిమాలు రిలీజ్ కానుండటమే టైగర్ నాగేశ్వరరావు సినిమాకి థియేటర్ కష్టాలు తెచ్చి పెట్టిందని చెప్పాలి.

- Advertisement -

బాలకృష్ణ గత రెండు సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి తో బ్లాక్ బస్టర్స్ అందుకున్న నేపధ్యంలో భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరో పక్క లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న లియో సినిమా కావటంతో లియోకి పాన్ ఇండియా వైడ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఆ రకంగా రిలీజ్ డేట్ మైనస్ గా మారిన టైగర్ నాగేశ్వరరావు సినిమా భవిష్యత్తు భగవంత్ కేసరి, లియో సినిమాల రిజల్ట్ మీద డిపెండ్ అయ్యుంటుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు