Bhagavant Kesari: బాలయ్య కోసం మహేష్ బాబు..!

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన భగవంత్ కేసరి మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో జెట్ స్పీడ్ లో ప్రమోషన్స్ చేస్తోంది సినిమా యూనిట్. ఇదిలా ఉండగా 16న జరగనున్న భగవంత్ కేసరి ప్రి రిలీజ్ ఈవెంట్ గురించి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే శిల్పకళావేదికలో గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఈ ఈవెంట్ కి సువర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడట.
ఇప్పటిదాకా రిలీజైన సాంగ్స్, ట్రైలర్ తో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఈ న్యూస్ మరింత హైప్ యాడ్ చేసింది. గతంలో కొన్ని సినిమాల ఈవెంట్స్ కి మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయినప్పటికీ బాలకృష్ణ సినిమా ఈవెంట్ కి అటెండ్ అవ్వటం ఇదే ఫస్ట్ టైమ్ కావటంతో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచుతోంది.
మొదట 14న ప్లాన్ చేసిన భగవంత్ కేసరి ప్రి రిలీజ్ ఈవెంట్ ని ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కారణంగా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. 15న రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరావు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండటంతో 16కి ఫిక్స్ అయ్యింది సినిమా యూనిట్. ఇక 17న ఆహాలో ఉన్స్టాపబుల్ సీజన్3 ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఉండటం, 18న యూస్ లో ప్రీమియర్స్, 19న సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు