Faria Abdullah: ఏమైపోయావ్ చిట్టి

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన హిట్ సినిమా చేసిన తర్వాత కూడా కొందరికి అవకాశాలు రాకపొవచ్చు. ఒక ప్లాప్ సినిమా పడినా కూడా వరుసగా సినిమా అవకాశాలు వచ్చే పరిస్థితులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీ లీలా. “పెళ్లి సందడి” సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీలాకి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ అందరిలో స్టార్ హీరోస్ తో కూడా ప్రాజెక్ట్స్ చేస్తూ మంచి స్పీడ్ మీద దూసుకు వెళ్తుంది.

శ్రీలీలా మొదటి సినిమా అంత హిట్ కాకపోయినా కూడా కెరియర్ డోకా లేకుండా బిజీబిజీగా సాగిపోతుంది. ఇకపోతే మొదటి సినిమాతో బీభత్సమైన హిట్ అందుకున్న ఫరియా అబ్దుల్లాకు మాత్రం అవకాశాలు అంతంత మాత్రమే వస్తున్నాయి. జాతి రత్నాలు సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో కామెడీ ఎంత బాగా వర్కౌట్ అయిందో ఆ సినిమా కలెక్షన్స్ ప్రూవ్ చేసేయ్.

అలానే నవీన్ పోలిశెట్టి, అబ్దుల్లా మధ్య కెమిస్ట్రీ కూడా బానే వర్కౌట్ అయింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత చాలామంది సోషల్ మీడియాలో కూడా ఫరియా అబ్దుల్లాను ఫాలో అవుతూ చిట్టి చిట్టి అంటూ ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు సరైన హిట్ సినిమా ఫరియాకి పడలేదు. రవితేజ నటించిన రావణాసుర సినిమాలో కనిపించింది కానీ ఆ సినిమా తన కెరీర్ కి ఉపయోగపడలేదు. సంతోష్ శోభన్ సరసన చేసిన “లైక్ షేర్ సబ్స్క్రయిబ్” సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందించలేదు.

- Advertisement -

టాలెంట్, అందం, డాన్స్ అన్ని సమపాళ్లలో ఉన్న ఈ బ్యూటీకి “జాతిరత్నాలు” తరువాత సరైన హిట్టు పడలేదు. మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకెళ్తే ఫ్యూచర్లో మంచి హీరోయిన్ గా తెలుగులో సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

Filmify gives exciting updates on celebrities in Bollywood & Tollywood and other industries. Also provides new movie release dates & updates, Bollywood cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు