Sreeleela: శ్రీలీలకూ తప్పని కమిట్మెంట్ కష్టాలు… మూవీ ఛాన్సుల కోసం.. !

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే శ్రీలీల అని టక్కున చెప్పేస్తారు ఎవరైనా. గత ఏడాది నుంచి వరుస ఆఫర్లతో, అలాగే వాటికి తగ్గ హిట్స్ తో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తోంది ఈ అమ్మడు. ఏ ముహూర్తంలో “పెళ్లి సందడి” అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిందో కానీ, అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి చేరుకుంది. కేవలం ఇప్పటి వరకు నాలుగైదు సినిమాల్లో మాత్రమే కనిపించిన శ్రీలీల… రవితేజతో “ధమాకా”, బాలయ్యతో “భగవంత్ కేసరి” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.

ఈ రెండింటి మధ్యలో “స్కంద” మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించినప్పటికీ, ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తో “ఆదికేశవ”, మరో యంగ్ హీరో నితిన్ సరసన “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” వంటి సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో “గుంటూరు కారం”లో కనిపించే అరుదైన అవకాశాన్ని పట్టేసింది. ఇక ఆ తర్వాత “ఉస్తాద్ భగత్ సింగ్”లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేయనుంది శ్రీలీల.

ఇంతటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ శ్రీలీల సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అల్ట్రా స్టైలిష్ పిక్స్ పోస్ట్ చేయడమే కాకుండా, తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఫాన్స్ తో ముచ్చటించిన శ్రీలీల సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా కనిపించే కమిట్మెంట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

- Advertisement -

సోషల్ మీడియాలో ఇంటరాక్షన్ సందర్భంగా నెటిజెన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన శ్రీలీలను ఓ నెటిజన్ మాత్రం ఇబ్బంది పెట్టేశాడు. ఆర్ యు కమిటెడ్? అంటూ సూటిగా ఈ బ్యూటీకి ప్రశ్నను సంధించాడు. ఇక శ్రీలీల కూడా తక్కువేం తినలేదు. “అవును… నా పని విషయంలో నేను కమిటెడ్ గానే ఉంటాను” అంటూ అతనికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఇక ఇదంతా చూసిన శ్రీలీల అభిమానులు ఆ సందర్భంలో ఆమె చాకచక్యంగా వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ శ్రీలీల జోడిగా నటించిన “ఆదికేశవ” మూవీ నవంబర్ 24న థియేటర్లలో సందడి చేయనుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు