Pavitra Lokesh: పవిత్రా లోకేష్ ఒక్కరోజుకే అంత డిమాండ్ చేస్తోందా?

టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో పవిత్రా లోకేష్ ఒకరు. తాజాగా ఆమె రెమ్యూనరేషన్ విషయమై మరోసారి వార్తల్లో నిలిచారు. కన్నడ చిత్ర సీమలో హీరోయిన్ గా నటించిన పవిత్ర, ఆ తరువాత అక్క. వదిన, తల్లి వంటి సపోర్టింగ్ రోల్స్ పరిమితమైంది. ప్రస్తుతం పవిత్ర తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది.

ఇక కరోనా టైంలో పవిత్ర పాపులర్ అయినంతగా మరే విషయం పాపులర్ కాలేదని చెప్పాలి. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర డేటింగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, కానీ ఆ పెళ్ళికి నరేష్ రెండో భార్య అయిన రమ్య రఘుపతి అడ్డంకులు క్రియేట్ చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు బెంగళూరులోని ఓ హోటల్లో వీరిద్దరూ స్టే చేయడం, అదే టైంలో నరేష్ రెండో భార్య రమ్య అక్కడికి వెళ్లి రచ్చ చేయడం ఇప్పటికే ఎవరు మర్చిపోలేని విషయం.

లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ నరేష్ పవిత్ర తమ రిలేషన్షిప్ ను బహిరంగంగానే బయటపెట్టారు. అప్పటినుంచి ఈ జంటకు టాలీవుడ్లో స్టార్స్ రేంజ్ కు మించిన పాపులారిటీ వచ్చిందని చెప్పాలి. ఒకవైపు ఇలా గొడవలు జరుగుతుండగానే నరేష్ మళ్లీ పెళ్లి అనే సినిమాతో తన కథను ప్రపంచానికి చూపే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆ సినిమాలో పవిత్ర లోకేష్ హీరోయిన్ గా నటించడం ఒక విశేషం అయితే, అందులో వారిద్దరి లిప్ లాక్ మరో సెన్సేషన్.

- Advertisement -

ఏదైతేనేం ఈ గొడవ తర్వాత టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలోనూ పవిత్ర రేంజ్ లో పాపులర్ అయిపోయింది అని చెప్పాలి. ఆమె పాపులారిటీ ఏ లెవెల్ కు చేరిందంటే… పవిత్ర తమ సినిమాల్లో నటిస్తే మంచి క్రేజ్ వస్తుందని మీడియం రేంజ్ బడ్జెట్ తో సినిమాలు నిర్మించే మేకర్స్ ఆలోచించేంతగా. ప్రస్తుతం పవిత్రకు టాలీవుడ్ లో బాగానే ఆఫర్లు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పవిత్ర ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాగా పవిత్ర ఒక్క రోజు కాల్ షీట్ ఇస్తే 50,000 ఛార్జ్ చేస్తుందట. అయితే నరేష్ తో తన అనుబంధం బలపడ్డాక పవిత్ర తన రెమ్యూనరేషన్ ను డబుల్ చేసిందని టాక్. ప్రస్తుతం ఆమె ఒక్క రోజు కాల్ షీట్ కు లక్ష రూపాయలు తీసుకుంటుందట. అయితే ఆమెకు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో నిర్మాతలు కూడా పవిత్ర అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారట.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు