Tollywood: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు ఇవే..!

దీపావళి అంటే థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉండాల్సిందే. అయితే ఈ దీపావళికి పెద్ద సినిమాలేవీ విడుదల కకపోవడంతో డబ్బింగ్ సినిమాలే సందడి చేయనున్నాయి. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…బోల్డ్ బ్యూటీ పాయల్, అజ్మల్ అమీర్ ముఖ్యపాత్రల్లో నటించిన మంగళవారం సినిమా నవంబర్ 17న విడుదల కాబోతుంది. తెలుగుతో పాటూ ఇతర భాషల్లో కూడా విడుదలవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలున్నాయి.

అదే రోజున విక్రాంత్ హీరోగా నటించిన స్పార్క్ లైఫ్ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మెహరీన్, రుక్సార్ దిల్హాన్ హీరోయిన్స్ గా నటించారు. అంతే కాకుండా చార్లీ777తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్తసరాగాలు దాటి సినిమా విడుదల కానుంది. ఈ కూడా కన్నడతో పాటూ ఇతర భాషల్లో విడుదల కాబోతుంది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన అన్వేషి సినిమా సైతం నవంబర్ 17న విడుదల కాబోతుంది. ఈ సినిమా అడవి నేపథ్యంలో తెరకెక్కినట్టు తెలుస్తోంది. హన్సిక ప్రధాన పాత్రలో నటించిన మై నేమ్ ఈజ్ శృతి సినిమా కూడా న‌వంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కింది.

ఇక ఓటీటీ విష‌యానికి వస్తే…అమెజాన్ ప్రైమ్ లో ట్విన్ ల‌వ్ అనే హాలీవుడ్ సినిమా న‌వంబ‌ర్ 17న‌ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. దాంతో పాటూ డిస్నీ హాట్ స్టార్ లో చిత్త అనే సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌వంబ‌ర్ 17న‌ విడుద‌ల కాబోతుంది. అదే రోజున క‌ర్నూర్ సినిమా కూడా విడుద‌ల కానుంది. ప్ర‌ముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో న‌వంబ‌ర్ 14న హౌటూ బిక‌మ్ ఎ మాబ్ బాస్, 16న బెస్ట్ క్రిస్మ‌స్ ఎవ‌ర్..అదే రోజున ది క్రౌన్ వెబ్ సిరీస్ విడుద‌ల కానున్నాయి. న‌వంబ‌ర్ 17న ది డాడ్స్, బిలీవర్ 2, సుఖీ, ది రైల్వే మెన్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. జియో సినిమాలో ది ఫ్లాష్ అనే తెలుగు సినిమా స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు