Jr NTR’s War2: “తారక్‌తో పోరాటం మరణం కంటే ప్రమాదం”… ఇది కదా కావాల్సింది

బాలీవుడ్ గడ్డపై తారక రాముడు అడుగు పెట్టబోతున్నాడు అని ఓ అనౌన్స్ మెంట్ వచ్చింది. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో వస్తున్న వార్ 2 సినిమాలో తారక్ నటించబోతున్నాడు. ఈ విషయం తెలిసిన నాటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు, తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చేయబోయే పాత్ర కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే కొన్ని రోజుల క్రితం వార్ 2లో తారక్ చేయబోయే పాత్ర విలన్ అని… హృతిక్ రోషన్ ను ఢీ కొట్టబోయే పవర్ ఫుల్ రోల్ అంటూ వార్తలు వచ్చాయి. అవి రూమర్స్ అని తెలిసినా, తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఎందుకంటే.. విలన్ పాత్రలో తారక్ గంభీరంగా కనిపిస్తాడు. ఇప్పటికే జై లవకుశ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో తారక్ కనించిన విధానాన్ని అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు.

ఇప్పుడు మళ్లీ విలన్ రోల్… అది కూడా స్పై నేపథ్యంలో వచ్చే హై ఎండ్ యాక్షన్ సినిమాల్లో అంటే.. ఊహించుకుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ నిజం అవ్వాలని తారక్ ఫ్యాన్స్ బలంగా అనుకున్నారు. అందుకే ఆ… రూమర్స్ నిజమయ్యాయి. వార్ 2 సినిమాలో తారక్ పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు.

- Advertisement -

ఈ విషయాన్ని టైగర్ 3 సినిమాలో చూపించారు. సినిమా టైంలో వార్ 2 గ్లింప్స్ ను ఆడియన్స్ కి చూపించారు. అందులో హృతిక్ రోషన్ కు ఒక వ్యక్తి విలన్ గురించి చెబుతున్నాడు. ఇండియాకు ఒక కొత్త శత్రువు తయారయ్యాడు. ఇప్పటి వరకు ఎవరు చూడని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అతడు ఎలా ఉంటాడో తెలియదు. పేరు కూడా తెలియదు. పూర్తిగా చీకట్లో ఉంటాడు. అతడిని ఎదుర్కోవాలంటే నువ్వు కూడా చీకట్లోనే వెళ్లాలి. అతడి పోరాటం మరణం కమంటే ప్రమాదం అంటూ వార్ 2లోని విలన్ పాత్రను పరిచయం చేశారు.

ఇక్కడ విలన్ ఎన్టీఆర్ అని గ్లింప్స్ లో చూపించలేదు. కానీ, తారక్ పాత్ర గురించే చెబుతున్నట్టు అందరికీ ఓ క్లారిటీ అయితే ఉంది. అలాగే గతంలో తారక్ విలన్ రోల్ చేయబోతున్నట్టు రూమర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు టైగర్ 3 సినిమా టైంలో వచ్చిన గ్లింప్స్ తో అది కన్ఫామ్ అయింది.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

clarity about Jr NTR’s role in the movie War 2 with the movie Tiger 3

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు