Vani Bhojan: బెడ్ రూమ్ సీన్ కోసం ఫోర్స్ చేశారు… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

కమిట్మెంట్ అనేది జిలుగు వెలుగుల రంగుల ప్రపంచం సినీ ఇండస్ట్రీలో చాలా సాధారణంగా వినిపించే పదం. వెండితెరపై మెరవడానికి, స్టార్ డమ్ కోసం కోటి ఆశలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టే అమ్మాయిలకు ఈ పరిస్థితి తప్పదు. సినీ పరిశ్రమలో నటీమణులపై వేధింపుల ఘటనలు తరచూ వింటూనే ఉంటాం. అదేవిధంగా హీరోయిన్లు తాము నటించే సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వంటి వారి ఏది చెబితే అది చేయవలసి వస్తుంది. డబ్బుతోనో, అవకాశాల పేరుతోనో లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. అయితే తాజాగా ఒక హీరోయిన్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురైందట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆ బ్యూటీ తనను శృంగార సన్నివేశాల కోసం ఫోర్స్ చేశారంటూ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. అసలు ఆ హీరోయిన్ ఎవరు అంటే…

హీరోయిన్ వాణీ భోజన్‌… తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు పెద్దగా పరిచయం లేదు. కానీ తమిళ ఆడియన్స్ కు మాత్రం బాగానే తెలుసు.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సూపర్ పాపులర్ అని చెప్పాలి. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన వాణీ భోజన్ ఇప్పుడు వెండితెరపై రాణిస్తోంది. “మీకు మాత్రమే చెప్తా” అనే తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్టైనర్ లో ఓ కీలక పాత్ర పోషించి తెలుగు సినీ ప్రియులను కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ సూపర్ హిట్స్ అయితే లేవు కానీ బిజీ హీరోయిన్ గానే కొనసాగుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల వాణీ భోజన్‌కి కూడా ఓ చేదు అనుభవం ఎదురైందట. ఇంటర్వ్యూ లో వాణి భోజన్ మాట్లాడుతూ: తాను నటించేందుకు అంగీకరించిన ఓ సినిమాలో అనవసరంగా ఓ సీన్ క్రియేట్ చేశారు మేకర్స్. అసలు ఆ సన్నివేశానికి, కథకు, సంబంధం లేదు. పడక గదిలో రొమాంటిక్ సీన్ అది. ఈ సీన్ సినిమాలో ఉందని తనకు ముందే చెప్పలేదని చెప్పుకొచ్చింది. అయితే సెట్స్‌కి వెళ్లగానే బెడ్‌రూం సీన్‌లో నటించమని తనను అడిగారట. ఆమె నటించనని చెప్పినా బలవంతం చేశారట. అలా చేయడం తనకు కోపం తెప్పించిందని, దీంతో ఆమె ఆ సీన్‌లో నటించే ప్రసక్తే లేదంటూ మెకాన్ కి తేల్చి చెప్పాను అంటూ వాణి భోజన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. డబ్బు కోసం నేను దిగజారను. అలాంటి పనులు చేస్తే వచ్చే డబ్బు నాకు అవసరం లేదు అంటూ ఆ సందర్భాన్ని ఎలా దాటుకొచ్చిందో వెల్లడించింది. నెటిజన్లు వాణి భోజన్ చేసిన పనిని మెచ్చుకుంటూ, ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు