Mangalavaram: పాయల్ సినిమాకు మెగా సపోర్ట్… బయటపడ్డ అసలు నిజం

బోల్డ్ మూవీస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం ఈ బ్యూటీ “మంగళవారం” అనే సినిమాలో నటిస్తోంది. “ఆర్ఎక్స్ 100” మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, “మంగళవారం” సినిమా నవంబర్ 17న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు మేకర్స్.

నవంబర్ 11న “మంగళవారం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో జరగనుండగా, ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ ను మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేయగా, నెటిజెన్లు పలు సందేహాలను వ్యక్త పరుస్తున్నారు. ఒక చిన్న సినిమాకు మెగా కాంపౌండ్ నుంచి ఇంత సపోర్ట్ ఎందుకు లభిస్తోంది? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్ ను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేయగా, మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా స్టైలిష్ స్టార్ రంగంలోకి దిగుతున్నారు.

దీని వెనకున్న అసలు రీజన్ ఏంటని ఆరా తీయగా అసలు నిజం బయటపడింది. అసలు విషయం ఏమిటంటే “మంగళవారం” సినిమాను నిర్మిస్తున్న లేడీ ప్రొడ్యూసర్ స్వాతి రెడ్డి చిరు చిన్న కూతురు శ్రీజకు క్లోజ్ ఫ్రెండ్ అట. ఈ ప్రత్యేక కారణం తోనే చిరంజీవి “మంగళవారం” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయగా, అల్లు అర్జున్ కూడా తన షూటింగ్స్ ను సైతం పక్కన పెట్టి శ్రీజ కోసమే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు చీప్ గెస్ట్ గా రావడానికి ఒప్పుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక స్వాతి రెడ్డి ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు. నిమ్మగడ్డ ప్రసాద్ కి, మెగా ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే మెగా కాంపౌండ్ నుంచి “మంగళవారం” సినిమాకు సపోర్ట్ లభిస్తోందట.

- Advertisement -

కాగా “మంగళవారం” మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలను పెంచేశాయి. ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించి పాయల్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు