Bollywood: కరణ్ ని చూసి వణికిపోతోన్న నాని… కారణమేంటి?

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నేచురల్ స్టార్ నాని బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ని చూసి వణికిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే… తాజాగా తెలంగాణ రౌండ్‌టేబుల్ 2023 సమావేశానికి హాజరైన నాని పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నానికి విలేఖరులు పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. అందులో భాగంగానే ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో కనిపించాలనుకుంటున్నారా ? అనే ప్రశ్నకు ఊహించని సమాధానం ఇచ్చి అందరినీ నివ్వెరపరిచాడు. ‘కాఫీ విత్ కరణ్’ షో కోసం స్వయంగా కరణ్ ఆహ్వానం పలికినా, దీనికి తాను సున్నితంగా నో చెబుతానని నాని కుండబద్ధలు కొట్టాడు. నిజానికి ఆ షో తనకు ఇష్టమేనని, తాను కూడా చూస్తానని చెప్పిన నాని ఆ షోకి మాత్రం వెళ్లనని ఖరాకండీగా చెప్పేశారు. వ్యక్తిగత జీవితాన్ని బహిరంగంగా చర్చించడం సరికాదనేది నాని అభిప్రాయమట.

‘కాఫీ విత్ కరణ్’ ఫేమస్ చాట్ షోనే కాకుండా వివాదాస్పద షో కూడా అని చెప్పాలి. షో ప్రతి సీజన్‌లో ఏదో ఒక వివాదం ఉంటుంది. అందుకే చాలా మంది నటులు, నటీమణులు ఈ షోకి దూరంగా ఉండడానికే ఇష్టపడతారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో నాని పేరు కూడా చేరిపోయింది. నిజానికి బాలీవుడ్ లో అడుగు పెట్టాలి అనుకునే యంగ్ హీరోలకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. ఈ షో ద్వారా కేవలం వివాదాలు తెరపైకి రావడమే కాకుండా కొంతమంది బాగా పాపులర్ కూడా అయ్యారు. ఇక సౌత్ నుంచి ఈ షోలో పాల్గొన్న స్టార్స్ అతికొద్దిమంది అని చెప్పాలి. ‘ఆర్ఆర్ఆర్’ టీం, ‘లైగర్’ మూవీ టైంలో విజయ్ దేవరకొండ మాత్రమే ఈ షోకి హాజరయ్యారు. ఇప్పుడు నాని ఆ అవకాశం వచ్చినా వద్దు అంటూ ముందే సైడ్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం నాని ‘కాఫీ విత్ కరణ్’ షోను రిజెక్ట్ చేసిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నాని తాజా చిత్రం ‘హాయ్ నాన్నా’. ఇందులో ఆయన ‘సీతా రామం’ ఫేమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నాని తండ్రి పాత్రలో కనిపించనున్నారు. నిజ జీవితంలో కూడా నాని ఓ కొడుకుకు తండ్రి అన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు