Nani31: లెక్క సెట్ చేయడానికి ఒక్క “శనివారం సరిపోతుందన్న” నాని!

టాలీవుడ్ లో కొన్ని కాంబోలకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ కాంబో లో హిట్స్ వచ్చినా, ప్లాప్స్ వచ్చినా ఆడియన్స్ అవేమి పట్టించుకోకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఆ కాంబో లో మళ్ళీ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. అది హీరో, హీరోయిన్ కాంబో కావచ్చు. హీరో డైరెక్టర్ కాంబో కావచ్చు. అలాంటి ఒక సూపర్ కాంబో నే న్యాచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ అని చెప్పొచ్చు. ఈ కాంబో లో వచ్చిన “అంటే సుందరానికి” సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

లవ్ స్టోరీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ విమర్శకుల ప్రశంసలందుకుంది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. కానీ ఈ సినిమా టీవీల్లో ఎప్పుడేసినా యూత్ తెగ చూసేస్తారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాలో చూపించిన టేకింగ్, స్టైల్ ఆఫ్ మేకింగ్ గాని సూపర్ గా ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ కాంబో లో మరో సినిమా వచ్చేస్తుంది.

డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య నిర్మించబోయే ఈ సినిమాకి “సరిపోదా శనివారం” అంటూ అద్దిరిపోయే టైటిల్ ని కూడా పెట్టారు. వివేక్ ఆత్రేయ సినిమాలకి కథతో లింక్ అయ్యేలా మాంచి క్యాచీ టైటిల్స్ కూడా ఉంటాయని తెలిసిందే. తన సినిమాలకి ముందు బజ్ స్టార్ట్ అయ్యేదే టైటిల్స్ నుండి.

- Advertisement -

లేటెస్ట్ గా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా, నాని ఆ లుక్ లో రగ్డ్ మాస్ లుక్ తో ఉన్నాడు. హీరో క్యారెక్టరైజేషన్ గురించి సాయి కుమార్ వాయిస్ తో చెప్తూ, నాని ఎంట్రీ ఇస్తుంటే గూస్బంప్స్ రావడం గ్యారెంటీ. ఇక లాస్ట్ రెండు సినిమాలతో కామెడీ, లవ్ డ్రామా లని టచ్ చేసిన వివేక్ ఈ సారి మాస్ సినిమాతో వస్తున్నాడు. అయితే ఇది తెలుగు దర్శకుల మాస్ సినిమాల్లా కాకుండా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తూనే ఉంది.

ఇక ఈ సినిమాని కూడా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తుండగా, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు