Rashmika Mandanna: “గర్ల్ ఫ్రెండ్” ఒకే.. మరి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో?

డైరెక్టర్ నటుడు రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిలసౌ, మన్మధుడు2 వంటి చిత్రాలతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. గీత ఆర్ట్స్ సమర్పణలో మాస్ మూవీస్, ధీరజ్ ఎంటెర్టైనెంట్ బ్యానర్స్ లో విద్య, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు గా తెరకెక్కిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీ గా తెరకెక్కనుందని రాహుల్ రవీంద్రన్ చెప్పాడు. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా అనౌన్స్ చేస్తూ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నీళ్లలో మొక్కల మధ్య ఉన్న రష్మిక ని కొత్తగా చూపించాడు డైరెక్టర్. అలా చూపించడానికి అర్థం ఏమిటో తెలీదు గాని, రాహుల్ ఈసారి తన డైరెక్షన్ పై గట్టిగా పదును పెట్టాడని అనిపిస్తుంది.

అయితే అనౌన్స్ మెంట్ ఫస్ట్ లుక్ లో రష్మిక ని గర్ల్ ఫ్రెండ్ గా ఇంట్రడ్యూస్ చేసిన రాహుల్, ఈ సినిమాలో బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పలేదు. అంటే హీరో కి సంబంధించి అనౌన్స్ చేయలేదు. దీన్ని బట్టి ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ అని అర్థం అవుతుంది. మరి మేల్ లీడ్ లో ఎవరు నటిస్తున్నారనేది సస్పెన్స్ గా ఉంచారు మేకర్స్. ఒకవేళ ఈ సినిమాలో రాహుల్ రవీంద్రనే మెయిన్ లీడ్ గా చేయవచ్చు. మొత్తానికి సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎవరు అని సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు