Biggboss season7: ఈ వారం తప్పించుకున్న రతిక?

స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ఊహించని  మలుపులు  తీసుకుంటుంది. గత రెండు వారాలుగా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత షో చాలా ఇంట్రెస్టింగ్ గా మారిన నేపథ్యంలో ఎలిమినేషన్లు కూడా షాకింగ్ గా మారాయి. గత వారం నైని పావని ఎలిమినేషన్ తో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్, ఈ వారం పూజ మూర్తిని ఎలిమినేట్ చేసి ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు.

అయితే పెర్ఫార్మన్స్ పరంగా, ఆటలో పెద్దగా ఇంపాక్ట్ చేయకపోయినా భోలే, అశ్వనిని లని ఎలా కంటిన్యూ చేస్తున్నారని బిగ్ బాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 7 లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో లక్కీ కంటెస్టెంట్ గా రతిక రోజ్ ఆదివారం హౌస్ లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇవ్వగానే అందర్నీ సంతోషంగా పలకరించగా, తనకి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ కి సపోర్ట్ ఇచ్చింది. అయితే ఆ నెక్స్ట్ డే నామినేషన్ల ప్రక్రియ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నామినేషన్లు వెంటనే స్టార్ట్ కూడా అవ్వగా, ఈ వారం నామినేషన్ నుండి రతిక మాత్రం తప్పించుకుంది.

- Advertisement -

హౌస్ లోకి ఇప్పుడే రతిక రీ ఎంట్రీ ఇచ్చినందువల్ల ఈ వారం బిగ్ బాస్ తనని నామినేట్ చేయడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. దాంతో రతిక ఫస్ట్ వీకే సేఫ్ అయ్యిందని చెప్పొచ్చు. కానీ ఇక మీద ఆట మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని తెలుస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు