Pavitra lokesh : మళ్ళీ పబ్లిక్ లో నోరు జారిన డైరెక్టర్ వెంకటేష్ మహా

ఈ మధ్య యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా ఏ సినిమా చెయ్యట్లేదు కదా మరి వార్తల్లోకి ఎందుకు నిలుస్తున్నాడు అనుకుంటున్నారా.. అయితే ఈ మధ్యనే యంగ్ డైరెక్టర్, యాక్టర్ గా మారారు. ప్రస్తుతం వరుస సినిమాలలో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ గా ఉన్నాడు.

కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ మహా, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఏమాత్రం యాక్టింగ్ గురించి అవగాహన లేని వాళ్ళని మెయిన్ క్యారెక్టర్ లుగా పెట్టి తీసిన ఈ సినిమా అందరిచేత ప్రశంశలు అందుకుంది. అయితే ఈ సినిమా తరువాత డైరెక్టర్ వెంకటేష్ మహ సత్య దేవ్ హీరోగా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య అనే సినిమా తీశారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఓటిటిలో రిలీజై, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

అయితే ఇటీవలనే విమెన్స్ డే సందర్బంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్యూ లో పాల్గొన్న ఈయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడంతో సెన్సేషన్ గా నిలిచాడు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తెలుగులో ఎందుకు రావట్లేదు అనే టాపిక్ పై జరిగిన ఇంటర్యూ లో వెంకటేష్ మహా విజ్ఞత కోల్పోయి కెజిఎఫ్ సినిమా ఒక చెత్త సినిమా అని ,ఇలాంటి సినిమాలు థియేటర్ లో ఆడుతుంటే, జనాలు ఆ సినిమాలకే వత్తాసు పలుకుతున్నారు అలాంటప్పుడు విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఎవరు ముందుకి వస్తారని ఆయన వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో కొద్దీ రోజులు ట్రెండ్ అయ్యాడు.

- Advertisement -

అయితే ఈయన రీసెంట్ గా లేటు వయసు ఘాటు ప్రేమికులు నరేష్, పవిత్ర ల ప్రేమకథ చిత్రమైన “మళ్ళీ పెళ్లి” సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి హాజరై తాను సినిమాకి గెస్ట్ గా రావడం గర్వంగా ఉందని.. అలాగే డర్టీ హరి, మళ్ళీ పెళ్లి లాంటి సినిమాలతో యంగ్ డైరెక్టర్స్ ని యం యస్ రాజు ఇంస్పైర్ చేస్తున్నారని.. తాను ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూశానని అవి చూస్తే తనకి వణుకు వచ్చిందని చెప్పడంతో.. ముందునుంచే ఈ సినిమాపై నెగిటివ్ వైబ్స్ ఉండటం వల్ల వెంకటేష్ మహా ఈ రకంగా మాట్లాడంతో ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మదర్ సెంటిమెంట్ ఉన్న కెజిఎఫ్ సినిమా నచ్చదు గాని ఇలాంటి 50 ఏళ్ళ వయసు ప్రేమ కథలు నచ్చుతాయా అంటూ నెటిజన్లు వెంకటేష్ మహా ని ట్రోల్ చేస్తున్నారు

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు