NTR100 years: నందమూరి, అక్కినేని ఫ్యామిలీ ల మధ్య మనస్పర్థలు తొలిగినట్టేనా?

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం హీరోల్లో అందరు చెప్పుకునే పేర్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. తెలుగు సినిమాకు రెండు కళ్ళు అని ఈ హీరోలను చెప్పుకునేవారు. ఇండస్ట్రీలో ఏ హీరో, ఏ దర్శకుడైన సరే తెలుగు సినిమా గురించి మాట్లాడితే ముందుగా వీళ్ళ పేర్లే చెప్పడం జరుగుతుంది. నిజానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ బ్రదర్ అని పిలుచుకుంటూ అన్నదమ్ముల్లా మెలిగారు. అది చూసి అభిమానులు కూడా మురిసిపోయేవారు. ఆ తరువాత వీరి వారసులైన బాలకృష్ణ, నాగార్జున ఇదే లెగసి ని కంటిన్యూ చేస్తూ స్టార్లుగా ఎదిగారు.

అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తదనంతరం అదే అన్నదమ్ముల అనుబంధాన్ని ఆ స్థాయిలో కంటిన్యూ చేయలేకపోతున్నారు. బాలకృష్ణ రాజకీయంగా బిజీ అయితే, నాగార్జున బిజినెస్ ఫీల్డ్ లో బిజీ అయ్యారు. అయినా వీరు కలుసుకున్న ప్రతిసారి ఎంతో సఖ్యత తో ఉంటారు. ఆ తర్వాతి తరం అయిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాగ చైతన్య, అఖిల్ ఇదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు.

అయితే అక్కినేని హీరోలు స్టార్స్ అవ్వకపోవడం వల్లో, లేదా నందమూరి బాలకృష్ణ ప్రవర్తన కారణం చేతనో వీళ్ళ మధ్య అనుబంధం దూరమవుతూ వచ్చింది. ఇక రీసెంట్ గా బాలయ్య ఓ ఈవెంట్ లో పొరపాటున అక్కినేని తొక్కినేని అని టంగ్ స్లిప్ అయ్యాడు. దానికి అక్కినేని వారసులు సోషల్ మీడియా ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభిమానులు కూడా ముందు బాలయ్య మీద కోప్పడినా, తర్వాత బాలయ్య నోటి తడపాటు గురించి తెలిసిన చాలా మంది లైట్ తీసుకున్నారు.

- Advertisement -

ఇక రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ 100ఇయర్స్ ఫంక్షన్ లో బాలయ్య నందమూరి వారసులను ఆహ్వానించడం జరిగింది. ఈ వేడుకలో అక్కినేని ఫ్యామిలీ తరపున నాగ చైతన్య, సుమంత్ పాల్గొన్నారు. అక్కడ స్పీచ్ ఇచ్చిన నాగచైతన్య కూడా కాంట్రవర్సీలకు తావివ్వకుండా హుందాతనంతో వ్యవహరించాడు. అటు బాలయ్య కూడా వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. దీన్ని బట్టి నందమూరి, అక్కినేని ఫ్యామిలీ ల మధ్య మనస్పర్థలు తొలిగినట్లే అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. తొందర్లోనే నందమూరి, అక్కినేని వారసుల్లో ఎవరైనా కలిసి మల్టీస్టారర్ చిత్రాన్ని చేయాలనీ అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు