Pooja Hegde: ఇక బుట్టబొమ్మ కథ ఎండ్ అయినట్టేనా?

సినీ ప్రియుల్లో ఇక బుట్టబొమ్మ కథ ఎండ్ అయినట్టేనా? అనే అనుమానం స్టార్ట్ అయ్యింది. సౌత్ నుంచి నార్త్ వరకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అందాల భామలలో ఒకరైన పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన టాలెంట్‌తో సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ ఇటీవల కాలంలో రాధే శ్యామ్, బీస్ట్, హౌస్‌ఫుల్ 4 వంటి చిత్రాలలో బిగ్ స్టార్స్‌తో కలిసి బిగ్ స్క్రీన్ పై కనిపించింది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా పూజా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతూ ఉంటుంది. ఇక సౌత్ ఆడియన్స్ ముద్దుగా బుట్టబొమ్మ అని పిలుచుకునే పూజా హెగ్దే కథ ఎండ్ అయినట్టే కన్పిస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ ఏమీ లేవు. బాలీవుడ్ లో మాత్రం ఒకటి, రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుట్టబొమ్మ పెళ్ళికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మన బుట్టబొమ్మ ఓ స్టార్ హీరో వారసుడిని బుట్టలో వేసుకుందని, వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉండగా, ఈ ప్రేమ పక్షుల పెళ్ళికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ లో ఎంగేజ్మెంట్, వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి అని అంటున్నారు. దీంతో నెటిజన్లు హీరోయిన్ గా ఆమె కెరీర్ ఇక ఎండింగ్ కు వచ్చినట్టేనని, ఇంతకీ పూజను పెళ్లి చేసుకోబోయే ఆ స్టార్ హీరో వారసుడు ఎవరు? అని కామెంట్స్ చేస్తున్నారు. పూజ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలపై ఆమె స్వయంగా రెస్పొంద్ అయితే బాగుండునని కోరుకుంటున్నారు. అప్పుడు మాత్రమే ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలుస్తుంది.

కాగా గతంలో కూడా పూజా హెగ్డే ముంబై క్రికెటర్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు కర్ణాటకకు చెందిన ఓ క్రికెటర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కూడా ఇంతకుముందు రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ పూజా తన దృష్టి మొత్తం ప్రస్తుతం సినిమాలపైనే ఉందని వెల్లడించింది. అయితే మరోసారి ఆమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఈసారి పూజ తన పెళ్లి వార్తలపై లా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు