Spark: కొత్త హీరోతో నటించడానికి మెహ్రిన్ అన్ని కోట్లు తీసుకుందా?

టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటి “మెహ్రిన్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “కృష్ణగాడి వీర ప్రేమగాథ” తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి వరుస ఆఫర్లు దక్కించుకుంది. రవితేజ లాంటి స్టార్ హీరోలతో పాటు, నాని, నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో కూడా నటించింది. చూడ్డానికి కాజల్ డూప్ లాగే ఉన్న మెహ్రిన్ కి తన గ్లామర్ వల్ల ఎక్కువ కష్టపడకుండానే ఆఫర్లు వచ్చాయి.

అయితే కెరీర్ బిగినింగ్ లో ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఆ తర్వాత టాలెంట్, ప్లస్ హిట్లు ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. కానీ మెహ్రిన్ కి అదే కరువయ్యింది. లాక్ డౌన్ ముందు వరకు యాక్టీవ్ గా ఉన్న మెహ్రిన్ ఇప్పుడు ఒకటి అర ఆఫర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే హీరోయిన్ గా ఎలాంటి సినిమా అయినా చెయ్యడానికి డిసైడ్ అయింది ఈ భామ. సాధారణంగా పేరు వచ్చాక చిన్న హీరోలతో నటిస్తే మళ్ళి పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు రావని ఒక రూమర్ ఉంది. ఆ సెంటిమెంట్ ని గట్టిగా నమ్మినట్టు ఉంది ఈ అమ్మడు.

అందుకే ఒక నిర్ణయానికి వచ్చింది. చిన్న హీరోలతో చేస్తే భారీ రెమ్యూనరేషన్ ఇస్తేనే చేస్తానంటుంది. ఇంతకు ముందు సినిమాని బట్టి కోటి వరకు రెమ్యూనరేషన్ తీసుకునే మెహ్రిన్, ఇక తాజాగా వచ్చిన న్యూస్ లో తాను లేటెస్ట్ గా నటించిన స్పార్క్ సినిమాకు ఏకంగా 3 కోట్ల వరకు తీసుకుందని తెలుస్తుంది. స్పార్క్ సినిమాలో కొత్త హీరో కావడం వల్ల, సినిమాకి తన గ్లామర్ ప్లస్ అవుతుంది కాబట్టి, అంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేసి రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం.

- Advertisement -

అయితే ఈ లెక్కలు అఫిషియల్ గా బయటికి రానప్పటికీ స్పార్క్ సినిమా ప్రమోషన్లలో మెహ్రిన్ యాక్టీవ్ నెస్ ని చూసి నెటిజన్లు నిజమే అని అనుకుంటున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు