Alia Bhatt: ఆ పార్టుకు స‌ర్జ‌రీ చేసుకున్నా అలియా భ‌ట్…క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..!

బాలీవుడ్ లో కాఫీ విత్ క‌ర‌ణ్ టాక్ షో ఎంత ఫేమ‌సో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ షోలో క‌ర‌ణ్ అడిగే స్పైసీ ప్ర‌శ్న‌ల కోసం ప్రేక్ష‌కులు తెగ చూస్తుంటారు. అంతే కాకుండా క‌ర‌ణ్ బ‌డా ప్ర‌డ్యూస‌ర్ కావ‌డంతో టాప్ సెల‌బ్రెటీలు అంతా ఈ షోకు పిల‌వ‌గానే వ‌స్తుంటారు. ఇక తాజాగా ఈ షోలో బాలీవుడ్ బ్యూటీలు అలియా భ‌ట్, క‌రీనా క‌పూర్ సంద‌డి చేశారు.

ర్యాపిడ్ ఫైర్ లో క‌ర‌ణ్ అడిగిన ప్రశ్న‌ల‌కు ఇంట్రెస్టింగ్ స‌మాధానాలు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే త‌న‌పై వ‌స్తున్న అతిపెద్ద రూమ‌ర్ పై అలియా భ‌ట్ స్పందించారు. అలియా భ‌ట్ తెల్ల‌గా మార‌డానికి, స‌న్న‌గా అవ్వ‌డానికి స‌ర్జరీలు చేసుకుంద‌ని గ‌తంలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. దీనిపై స్పందించిన అలియా ఇది ఇంట‌ర్నెట్ యుగం ఎప్పుడూ ఏదో ఒక రూమ‌ర్ ఉంటూనే ఉంటుందని అన్నారు.

తాను కొవ్వు త‌గ్గించుకునేందుక స‌ర్జ‌రీలు చేసుకున్నాన‌ని తెల్ల‌గా మారేందుకు స‌ర్జ‌రీలు చేసుకున్నాన‌ని పుకార్లు సృష్టించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా త‌న వైవాహిక జీవితం పై కూడా పుకార్లు క్రియేట్ చేశార‌ని చెప్పింది. త‌న భ‌ర్త ర‌బ్ బీర్ క‌పూర్ లిప్ స్టిక్ పెట్టుకుంటే వెంట‌నే తీసేయ‌మంటాడ‌ని ఆయ‌న‌కు లిప్ స్టిక్ న‌చ్చ‌ద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాన‌ని అలియా తెలిపింది.

- Advertisement -

దాంతో ర‌ణ్ బీర్ క‌పూర్ త‌న‌ను వేధిస్తున్నాడు అంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ర‌న్ బీర్ క‌పూర్ చాలా మంది వ్య‌క్తి కాబ‌ట్టి ఆ వార్త‌ల‌ను ప‌ట్టించుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. అసలు ప్ర‌పంచం దృష్టి పెట్టాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయ‌ని కానీ ఇలాంటి వాటిపై ఫోక‌స్ పెట్ట‌డం బాధాక‌రం అని తెలిపింది. ఇదిలా ఉండ‌గా అలియా భ‌ట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సైతం ద‌గ్గ‌ర‌య్యింది. ఈ సినిమాలో సీత పాత్ర‌లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు