Siren Teaser Talk : 14 ఏళ్ళకు బయటికొచ్చింది పగ తీర్చుకోడానికా? లేకా?

కోలీవుడ్ స్టార్ హీరో “జయం రవి” గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్ సినిమాల ద్వారా ఇక్కడ పాపులర్ అయ్యి తన సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ పొన్నియిన్ సెల్వన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన జయం రవి ఈ ఏడాది ఇరైవన్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించగా, ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. తమిళ్ డైరెక్టర్ ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం లో జయం రవి హీరోగా నటించిన “కొత్త సైరెన్108”. ఈ సినిమా టీజర్ కాసేపటి కిందటే రిలీజ్ చేయడం జరిగింది.

ఇక సైరెన్108 టీజర్ ని తెలుగులో దిల్ రాజు లాంచ్ చేయడం జరిగింది. ఇక టీజర్ ని చూసాక కథ నేపథ్యంలో మేకర్స్ ఆల్మోస్ట్ క్లారిటీ ఇచ్చారని తెలుస్తుంది. ఇక సినిమాలో అన్యాయంగా జైలుకి వచ్చిన ఓ వ్యక్తి తాను జైలు నుండి యావజ్జీవ శిక్ష అనుభవించిన తర్వాత బయటికి వచ్చి ఏం చేసాడనేది సినిమా కథగా చూపిస్తున్నాడని తెలుస్తుంది. ఇక టీజర్ లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల షాట్స్ తో పాటు, పలు ఆక్షన్ సన్నివేశాల్ని చూపించారు.

- Advertisement -

ఇక టీజర్ లో జయం రవి లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. కీర్తి సురేష్ హీరోని పట్టుకునే జైలర్ అధికారిగా కీలక పాత్రలో నటించిందని తెలుస్తుంది. ఇక తమిళ్ సినిమా అయినా, అక్కడక్కడా అజయ్, తులసి లాంటి తెలుగు నటులు కూడా ఉన్నారు. అనుపమ పరమేశ్వరన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక టీజర్ కట్స్ స్టైలిష్ గా ఉండగా, జివి ప్రకాష్ ఇచ్చిన బీజీఎమ్ యావరేజ్ గా ఉంది. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. ఇక సైరెన్108 సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు