Dil Raju: దిల్ రాజు ప్లాన్ బెడిసికొట్టిందా?

టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘మంగళవారం’ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో పాటు, అందులో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇందులో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండడంతో మూవీపై అందరి దృష్టి పడింది. పైగా టైటిల్ కూడా ‘మంగళవారం’ అంటూ డిఫరెంట్ గా ఉండడంతో సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి హైప్ ఏర్పడింది. దీనికి తోడు మంగళవారం టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక, అప్పటికే ఉన్న బజ్ కాకుండా, హైప్ గ్రాఫ్ అనుకోని విధంగా పెరిగిపోయింది.

ఇక సినిమాలో అడల్ట్ కంటెంట్ కూడా ఉన్నట్టుగా టీజర్లో చెప్పకనే చెప్పేశారు. ఇంకేముంది యూత్ మనసంతా పాయల్ పైనే ఉండిపోయింది. ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూశారు. మొత్తానికి మూవీ ఈరోజు రిలీజ్ అయింది. అయితే సినిమా యావరేజ్ టాక్ తో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ బెడిసి కొట్టినట్టు అనిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే…

‘మంగళవారం ‘ మూవీ నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దిల్ రాజు తీసుకున్నారు. ఆయన నాలుగు కోట్లకు ఈ రైట్స్ తీసుకోగా, 6 కోట్లకు రీ బిజినెస్ చేసే ఛాన్స్ వచ్చిందనే టాక్ టాలీవుడ్ లో నడిచింది. టీజర్ రిలీజ్ అయ్యాక సినిమాపై ఉన్న హైప్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరగడంతో భారీగా అంచనాలు పెరిగాయి. అలాగే అజయ్ భూపతి కాన్ఫిడెన్స్ చూసి ఈ మూవీతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అనుకున్నారు అంతా. దీంతో దిల్ రాజు దగ్గర ఈ మూవీ రైట్స్ ను ఆరు కోట్లకు కొనడానికి కొందరు ప్రయత్నాలు చేశారట.

- Advertisement -

ఒకవేళ అప్పుడే దిల్ రాజు ఈ మూవీ నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని వాళ్ళు అడిగిన రేటుకు అమ్మేసి ఉంటే, ఇప్పుడు ఆయన జేబులో రెండు కోట్ల లాభం ఉండేది. కానీ దిల్ రాజు మాత్రం అజయ్ భూపతిపై నమ్మకంతో ఈ సినిమాను తానే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇక దిల్ రాజుకు నైజాంలో 49 ఓన్ థియేటర్స్ ఉండగా, మరో 125 థియేటర్లు ఆయన హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాయి. అందుకే థియేటర్లకు ఈ మూవీని లాభాల్లో షేర్ తీసుకునే విధంగా ఇచ్చారని సమాచారం. అయితే ప్రస్తుతం మూవీకి యావరేజ్ టాక్ రావడంతో దిల్ రాజు ప్లాన్ బెడిసి కొట్టినట్టు అయింది. మరి ఆయన ఈ సినిమాతో ఎంతవరకు లాభాలు అర్జిస్తారు? సినిమాపై ఆయన పెట్టుకున్న అంచనాలను అందుకోగలరా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఈ మూవీ వీకెండ్ లో పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటికి కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు