Spark: ఏంటో ఈ హీరోయిన్ కి అన్నీ ఉన్నా లక్ రావట్లేదు?

Spark:

టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం కొత్త హీరోయిన్లు వస్తుంటారు. అందులో కొందరు సక్సెస్ అవుతారు. కొందరు ఫెయిల్ అవుతారు. ఇంకొందరు తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు ‘రుక్సార్ ధిల్లాన్’. ఈ పేరు వింటే పెద్దగా గుర్తు పట్టక పోవచ్చు గాని, కృష్ణార్జున యుద్ధం రియా అంటే యిట్టె చెప్పేస్తారు. అంతలా ఆ సినిమాలో తన క్యూట్ గ్లామర్ తో కట్టిపడేసింది.

అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. నిజానికి 2017లోనే ఆకతాయి అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రుక్సార్ అప్పట్నుంచి అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది. వచ్చిన సినిమాల్లో బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నా హిట్ మాత్రం దక్కడం లేదు. ఫైనల్ గా లాస్ట్ ఇయర్ నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం హిట్ అయినా అందులో సెకండ్ లీడ్ గా నటించింది. ఫలితంగా వేరే హీరోయిన్ క్రెడిట్ ఎగరేసుకుపోయింది.

ఇప్పుడు ‘స్పార్క్’ అనే సినిమాతో మళ్ళీ తన లక్ టెస్ట్ చేసుకుంటుంది ఈ అమ్మాయి. కానీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పైగా హీరో కొత్త వాడడం, అందునా ఆకట్టుకునేలా లేకపోవడంతో సినిమా హిట్ అవుతుందా లేదా అన్న డౌట్ వస్తుంది. అయితే సినిమాలో రుక్సార్ ధిల్లాన్ కైనా ఇంపార్టెన్స్ ఉందా అంటే అది కూడా చెప్పలేం. ఎందుకంటే స్పార్క్ లో మరో హీరోయిన్ మెహ్రిన్ కూడా నటించింది. మరి ఇద్దరిలో ఎవరికీ ఇంపార్టెన్స్ ఉందొ ఏమో మరి. ఫైనల్ గా అందం, టాలెంట్ అన్నీ ఉన్నా రుక్సార్ కి అదృష్టం కలిసి రావట్లేదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు