Kushi: దాని వల్ల సామ్ కి ఒరిగిందేమిటి? నెగిటివిటీ తప్ప!

Kushi:

టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లకు అప్పుడప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. కొన్ని సార్లు అది అదృష్టం అని అనుకుంటారు, గాని చివరి వరకు వస్తే గాని తెలియదు. ఇప్పుడు సమంత పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ అమ్మాయి కెరీర్ బిగినింగ్ లోనే స్టార్స్ అయిన హీరోయిన్లలో ఒకరు. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లలోనే స్టార్ హీరోయిన్ గా మారి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. అలోమోస్ట్ టాప్ హీరోలందరితోనూ నటించిన ఈ భామ, యంగ్ హీరోలతో కూడా నటిస్తూ, బిజీగా ఉంది.

అయితే నాగచైతన్య తో విడిపోయాక మాత్రం ఈ అమ్మడికి ఏరకంగాను కలిసి రావట్లేదు. సోషల్ మీడియా లో చెయ్ ని సపోర్ట్ చేసే వాళ్ళు విమర్శిస్తుంటే, మరికొందరు జాలి చూపించారు. కానీ సామ్ ఎప్పుడూ జాలి కోరుకోలేదు. తన కష్టాన్ని గుర్తిస్తే చాలు అనుకుంది. ఇక ఈ ఇయర్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన శాకుంతలంలో నటించినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఆ ప్లాప్ నుండి తేరుకుని ఎంతో ఇష్టం తో చేసిన ఖుషి కూడా అంచనాలను అందుకోలేకపోయింది. పైగా ఆ సినిమాలో విజయ్ దేవరకొండతో చేసిన రొమాన్స్ అస్సలు బాగాలేదని జనాలు అన్నారు. పెళ్లయ్యాక చాలా రోజులు ఇలాంటి సినిమాలు చేయలేదు సామ్. కానీ చెయ్ తో విడిపోయాక సినిమాల్లో రొమాంటిక్ సీన్లలో నటించే సరికి సమంత పై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. పోనీ ఎంత కష్టపడ్డా ఖుషి వల్ల సమంత కి పేరొచ్చిందా అంటే, ఆ రోల్ చేసినందుకు నెగిటివిటియే ఎక్కువ వచ్చింది. ఇక సినిమా కూడా ఓపెనింగ్స్ అదరగొట్టి తర్వాత ఆడలేక ప్లాప్ అయింది. మరి ఇప్పటికైనా సమంత తన ఉన్న పేరును చెడగొట్టుకోకుండా పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న సినిమాలు చేస్తే మంచిదని ట్రేడ్ జనాలు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు