Vaishnav Tej: పాపం వైష్ణవ్ తేజ్… సపోర్ట్ చేసేది లేదంటూ తెల్చేసిన పవన్

యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ కి మెగా కాంపౌండ్ నుంచి ప్రస్తుతం పెద్దగా సపోర్ట్ లభించడం లేదు. మొదటి సినిమాతోనే టాలీవుడ్లోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత ‘కొండ పొలం’, ‘రంగ రంగ వైభవంగా’ అనే సినిమాలతో వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ‘ఆదికేశవ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. వైష్ణవ్ ఇప్పుడు ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ మెగా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది.

మరోవైపు సినిమా గురించి టాలీవుడ్ లో పెద్దగా సందడి కనిపించడం లేదు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కు కూడా ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభించలేదు. ఇక మూవీలో హాట్ అండ్ హేపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఉన్నప్పటికీ యూత్ కనీసం ఆమె మొహం కూడా చూడడం లేదు.

దీంతో ప్రొడ్యూసర్ సినిమాపై హైప్ ను క్రియేట్ చేసే దారులు వెతుక్కుంటున్నారు. అయితే దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా వైష్ణవ్ తేజ్ కి అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ ఏడాది అసలు ఆయనకు ఏమాత్రం కలిసి వచ్చేలా కనిపించడం లేదు.

- Advertisement -

ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇదే ఆలోచనను పవన్ కళ్యాణ్ ముందు ఉంచగా, ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా, మెగా కాంపౌండ్ హీరో అన్న కనికరం కూడా లేకుండా నో చెప్పేసాడట. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తుండడంతో, ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఎలాంటి సినిమా కార్యక్రమాలకు హాజరు కాకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఆయన ఎలక్షన్స్ అయ్యేదాకా తన సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దీంతో ఇప్పుడు వైష్ణవ్ తేజ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అటు మామయ్య తో పాటు, ఇటు మెగా ఫాన్స్ కూడా సినిమాను ఆదరించే ఆలోచనలో లేరు. కనీసం సపోర్ట్ కూడా ఇవ్వడం లేదు. మరి ఇలాంటి సిచువేషన్ లో ‘ఆదికేశవ’ పరిస్థితి ఏమవుతుంది అన్నది అంతు పట్టడం లేదు. మరి సినిమాపై బజ్ ఎలా క్రియేట్ చేస్తారో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు