RC16: మొన్న లీలమ్మ, నిన్న బేబమ్మ, నేడు భానమ్మ? మేకర్స్ చెప్పేదాకా ఆగండయ్యా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబో లో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల బుచ్చిబాబు సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. కానీ శంకర్ ఇండియన్ 2 పనుల్లో బిజీగా ఉండడం వల్ల బుచ్చిబాబు తో చరణ్ ఏ రోజైనా సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా RC16 లో రామ్ చరణ్ కి జోడీగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుందంటూ మొన్నటివరకూ వార్తలు వచ్చాయి. ఆల్మోస్ట్ శ్రీ లీలే కన్ఫర్మ్ అని మెగా కాంపౌండ్ యొక్క ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ కస్టడీ మూవీ ప్రమోషన్స్ టైం లో కృతి శెట్టి ఫేవరేట్ హీరో చరణ్ అని తెలిసి అప్పట్నుంచి rc16 లో బెబెమ్మే హీరొయిన్ అంటూ వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి RC16 లో హీరోయిన్ గా నటిస్తుందంటూ వార్తలు మొదలయ్యాయి. గత రెండు మూడు రోజులుగా ఈ న్యూస్ సోషల్ మీడియా లో విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఈ న్యూస్ పై ఎక్కడా మేకర్స్ గాని డైరెక్టర్ గాని స్పందించలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఫిక్స్ అయిపోయి షేర్లు చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అప్పుడే హీరోయిన్ గురించి క్లారిటీ వస్తుందని తెలుస్తుంది.

- Advertisement -

అది కూడా మైత్రి మూవీ మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేస్తేనే క్లారిటీ గా ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయితే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా డిసెంబర్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు