National Crush: బాలయ్య సాక్షిగా అన్ని బయట పెట్టేస్తుందా?

నేషనల్ క్రష్ గా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల మెప్పు పొందుతున్న రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గీతా గోవిందం తో మంచి క్రేజ్ సంపాదించడమే గాకుండా, బోనస్ గా విజయ్ తో ప్రేమలో కూడా పడిందని, అప్పట్నుంచి వార్తలొస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఇక ఆ వెంటనే వీళ్ళు డియర్ కామ్రేడ్ లో కలిసి నటించగా సినిమా ఆడకపోయినా వీళ్ళ పెయిర్ కి మంచి మార్కులు పడ్డాయి.

అయితే ఆ తర్వాత మాత్రం విజయ్ రష్మిక ఓపెన్ గా పెద్దగా కలిసి తిరిగిన సందర్భాలు లేవు. అయితే వీళ్ళు దూరంగా ఉంటుంది సోషల్ మీడియా కంట పడకుండా మాత్రమే అని తెలుస్తూనే ఉంది. కొన్ని రోజుల కిందట విజయ్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా రష్మిక వచ్చి వెళ్తుండేదని వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడయితే విజయ్ ఇంటి బాల్కనీ లో ఉండి రష్మిక ఫోటోలు పెట్టిందో అప్పట్నుంచి ఫ్యాన్స్ ఆల్మోస్ట్ కంఫర్మ్ అయిపోయారు. కానీ రష్మిక ఏనాడూ ఆ టాపిక్ మాట్లాడలేదు.

ఇక తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ తో కలిసి రష్మిక కూడా రావడం జరిగింది. ఇక అక్కడ సందర్భం లేకపోయినా, రణబీర్ కపూర్, విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ఫోటో వేసి రష్మిక ని ఇద్దరిలో ఎవరు హ్యాండ్సమ్ అని అడిగారు. అప్పటికే ఆ సిగ్గుతో ఆడియన్స్ కి తెలిసిపోతుంది. అన్నిటికి మించి బాలయ్య వెంటనే విజయ్ దేవరకొండ కి ఫోన్ చేయించాడు.

- Advertisement -

ఇక అక్కడితో రష్మిక ఎదో మ్యానేజ్ చేయాలనీ ట్రై చేస్తున్నా, బాలయ్య వదల్లేదు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో పెద్దగా తెలియలేదు గాని, బాలయ్య చొరవతో ఖచ్చితంగా రష్మిక ఈ షో లో ఓపెన్ అయిపోతుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ఈ షో నవంబర్ 24న టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజున క్లారిటీ రావచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు