Vaishnav Tej’s Adikeshava: చేసేదేమీ లేదు – తప్పుకోవాల్సిందే..!

Vaishnav Tej’s Adikeshava

మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ ప్రస్తుతం ఆదికేశవ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గ్లిమ్ప్స్ ఇటీవలే విడుదలై సినిమా మీద ఆసక్తిని పెంచింది. ఈ సినిమా రిలీజ్ జులైలో ఉంటుందని టాక్ వచ్చింది కానీ, షూటింగ్ పెండింగ్ ఉండటంతో ఆగస్టు 18న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. అయితే, ఆగస్టులో చిరంజీవి భోళాశంకర్ ఆగస్టు 11న రిలీజ్ కానుండగా, వరుణ్ తేజ్ నటించిన గాండీవదారి అర్జున సినిమా ఆగస్టు 25న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇంత టైట్ షెడ్యూల్ లో సినిమా రిలిజ్ చేస్తే వర్కౌట్ అవ్వదని భావించిన సినిమా యూనిట్ రిలీజ్ పోస్ట్ పోన్ చేయాలనీ డిసైడ్ అయినట్లు సమాచారం.
వైష్ణవ్ గత రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వల్ల ఆదికేశవ హిట్ అవ్వటం కీలకంగా మారింది. రొటీన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు హీరోయిన్ శ్రీలీల మాత్రమే పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది. ఆచార్య సహా గతంలో టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వకపోవటం కూడా ఈ సినిమాపై బజ్ లేకపోవటానికి కారణం అని చెప్పవచ్చు.
ఉప్పెన సినిమా ద్వారా మొదటి ప్రయత్నంలోనే 100కోట్ల క్లబ్ లో చేరిన వైష్ణవ్ తేజ్ కి ఇప్పుడు హిట్ తప్పనిసరైన పరిస్థితి నెలకొంది. టైటిల్ గ్లిమ్ప్స్ మినహా వేరే అప్డేట్ లేని ఈ సినిమా రిలీజ్ ఆగస్టులో గనక లేకపోతే, సెప్టెంబర్ మాత్రమే సరైన సమయం అని చెప్పచ్చు. మరి, ఉప్పెన తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న వైష్ణవ్ కి ఆదికేశవ సినిమా బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు