Anasuya Comments: పెదకాపు అర్థం కాలేదు… అందుకే అలా..!

ఇటీవల విడుదలైన చిన్న సినిమా పెదకాపు-1.. పెద్ద విజయం సాధిస్తుందని, శ్రీకాంత్ అడ్డాలకు ఓ కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, పెదకాపు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథపరంగా బాగానే ఉన్నా… అది ప్రేక్షకులకు అర్థం కాకపోవడం, ల్యాగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్ల పెదకాపు పెద్ద విజయం సాధించలేకపోయిందని చెప్పొచ్చు. దీంతో మూవీ యూనిట్ కొంత వరకు అసంతృప్తి ఉంది అనేది వాస్తవం.

Read More: Peddha Kapu: పెదకాపు కి ఫుల్ స్టాప్ పడినట్లేనా.?

ఇక ప్రొడ్యూసర్ కి అయితే చాలా లాస్ వచ్చింది. అది ఎంతంటే… పార్ట్ 2ను క్యాన్సిల్ చేసే ఆలోచన వచ్చేంత నష్టం. అయితే సినిమా రిలీజ్ అయిన వెంటనే ఒకరు మాత్రం శ్రీకాంత్ అడ్డాలపై మూవీపై చాలా కోపంతో ఉన్నారని వార్తలు వచ్చాయి. తన పాత్ర గురించి శ్రీకాంత్ అడ్డాలతో గొడవకు కూడా దిగిదంటూ న్యూస్ వచ్చింది. ఆమె ఎవరంటే.. పెదకాపులో అక్కమ్మ పాత్రలో కనిపించిన అనసూయ.

- Advertisement -

సినిమా ఫైనల్ అవుట్ పుట్ చూసిన తర్వాత… అనసూయ హార్ట్ అయిందట. ఎందుకంటే, పెదకాపు స్టోరీ చెప్పినప్పుడు… అనసూయ కెరీర్ లో అక్కమ్మ పాత్ర… రంగస్థలంలోని రంగమ్మత్త పాత్రలో నిలిచిపోతుందని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెప్పాడట. కానీ, తీరా సినిమా రిలీజ్ అయ్యాకా.. చూస్తే.. అలాంటిదేమీ ఆ పాత్రలో లేదు. దీనిపై ఇప్పటి వరకు తన సన్నిహితుల దగ్గర మాత్రమే మాట్లాడిన అనసూయ.. ఇప్పుడు బహిరంగంగా స్పందించింది.

Read More:PeddhaKapu1: రేలంగి మామ మళ్ళీ ఆ రిస్క్ చేస్తాడా..?

తనకు పెదకాపు స్టోరీ అర్థం కాలేదని, తనలా… ప్రేక్షకులకు కూడా పెదకాపు అర్థం కాకపోవచ్చని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాలో తన పాత్రకు సంబంధించి కట్స్ జరిగాయని ఒప్పుకుంది. ఈ కట్స్ వల్లే.. తన పాత్రకు సినిమాకు కనెక్షన్ కట్ అయిందని అనసూయ వివరించింది. అయితే పార్ట్ 1లో మొత్తం చూపిచంకుండా.. పార్ట్ 2లో శ్రీకాంత్ అడ్డాల ప్లాన్ చేసి ఉంటాడని చెబుతుందతి. పార్ట్ 2 చూస్తే అర్థమవుతుందని చెప్పుకొచ్చింది.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు