Andala Rakshasi: మిథున పెళ్ళికి చిరంజీవి వచ్చాడు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో చాలామంది కరోనా టైంలో పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాళ్ళు అయిపోయారు. అలానే కొన్ని ఏళ్లుగా ప్రేమలో ఉన్న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కి పెళ్లి చేసుకున్నారు. ఒక హీరోకి, హీరోయిన్ కి మధ్య ఏదైనా జరుగుతుంది అని వార్తలు వస్తేనే ప్రేక్షకులు అభిమానులు ఏదేదో ఊహించుకుంటారు. కానీ కొన్ని ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న కూడా వీళ్ళు ప్రేమ బయటపడకుండా, ఫోటోలకి, మీడియాకి చిక్కకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు.

Read More:#VarunLav: లావణ్య త్రిపాఠి ధరించిన పెళ్లి చీర ధర ఎంతో తెలుసా..?

వరుణ్ తేజ్, లావణ్య వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా మిస్టర్ మాత్రమే. ఆ సినిమా కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ వరుణ్ తేజ్ కి మాత్రం ఒక మిస్సెస్ ని ఇచ్చింది అని చెప్పొచ్చు. “చావు కబురు చల్లగా” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. లావణ్యను ఉద్దేశిస్తూ ఇక్కడే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉండిపో అని చెప్పారు. ఆ మాటను సీరియస్ గా తీసుకొని వరుణ్ తో సెటిల్ అయిపోయింది లావణ్య త్రిపాటి.

- Advertisement -

Read More:Varun Tej: వరుణ్ – లావణ్య ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి ఇంత పెద్ద కారణం ఉందా..?

హను రాఘవపూడి దర్శకుడుగా పరిచయమైన “అందాల రాక్షసి” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది లావణ్య. ఆ సినిమాలో లావణ్యని చూపించిన విధానం, లావణ్య అమాయకత్వం, వీటన్నిటిని అద్భుతంగా చూపించి తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని కలిగించాడు హను. ఇప్పటికీ అందాల రాక్షసి సినిమాలో మిధున అంటే తెలియని ప్రేక్షకుడి ఉండడు అనడం అతిశయోక్తి కాదు.

హను మిధున క్యారెక్టర్ డిజైన్ చేసే విధానం అంతలా ఉంటుంది. చాలా ఏళ్ళు తర్వాత ఒక మణిరత్నం కైండ్ ఆఫ్ సినిమాను చూసిన ఫీలింగ్ కలిగించాడు అందాల రాక్షసి సినిమాతో. అయితే యాదృచ్ఛికంగా ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మిధున పెళ్లికి రెడీ అయినప్పుడు కొంతమంది పిల్లలు వచ్చి మిధున అక్క పెళ్లికి సినిమా హీరోలు వస్తున్నారంటగా, చిరంజీవి కూడా వస్తాడా.? అంటూ ఒక పిల్ల ఆ సినిమాలో అడుగుతుంది. అది నేడు నిజమైంది నిజంగానే మిధునగా పరిచయమైన లావణ్య త్రిపాఠి పెళ్లికి చిరంజీవి కుటుంబ సమేతంగా రావటమే కాకుండా తన కుటుంబంలో అబ్బాయిని తనకు జంటగా ఇచ్చాడు.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు