Guntur Karam: ఘాటుగా మాములుగా ఉండదు అన్నారు, ఇప్పుడు ట్రోల్స్ మాములుగా లేవు.

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ టాప్ లో ఉన్నాడు అని చెప్పొచ్చు.  మణిశర్మ, రాజ్ కోటి వంటి దర్శకుల దగ్గర డ్రమ్స్ ప్లేయర్ గా పనిచేసిన థమన్, కిక్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు.  కిక్ సినిమా సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  తన మొదటి సినిమాతోనే అద్భుతమైన పేరుని సంపాదించి వరుస అవకాశాలను అందుకున్నాడు.

Read More: Guntur Kaaram Update: ఇది బాబు గారి రీవెంజ్… అందుకే గుంటూరు కారం లేట్?

థమన్ కి “కిక్” సినిమా తర్వాత  వరుస అవకాశాలు రావడంతో  వెంట వెంటనే ప్రాజెక్ట్స్ చేస్తూ స్టార్ హీరోల సినిమాలు కూడా చేసే స్థాయికి వెళ్లిపోయాడు.వరుస సినిమాలు చేస్తున్న తరుణంలో  థమన్ ట్యూన్స్ కూడా జనాలకు బోర్ కొట్టాయని చెప్పొచ్చు.  మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా చేసిన “తొలిప్రేమ” సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. థమన్ కెరియర్ లో ముఖ్యంగా చెప్పాల్సింది “అరవింద సమేత వీర రాఘవ” అది థమన్ చేసిన 100వ సినిమా.

- Advertisement -

థమన్ కెరియర్ ను  “అరవింద సమేత” ముందు “అరవింద సమేత” తర్వాత అని చెప్పొచ్చు.  ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పరిచయం తర్వాత థమన్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయడం.  మంచి మంచి ట్యూన్స్ ఇవ్వడం.  ఏ పాట చేసినా అది మిలియన్ వ్యూస్ దాటడం ఇదంతా కామన్ అయిపోయింది.  అయితే రీసెంట్ టైమ్స్ లో థమన్ మీద ట్రోల్స్  మొదలయ్యాయి. థమన్ కి ట్రోల్స్ కొత్తేమి కాదు.

Read More: Guntur Kaaram: మహేష్ ఫారిన్ ట్రిప్స్ పై ప్రొడ్యూసర్ కామెంట్స్..!

రీసెంట్ గా థమన్ చేస్తున్నవన్ని పెద్ద ప్రాజెక్టులు.  పవన్ కళ్యాణ్ “ఓజి” మహేష్ బాబు “గుంటూరు కారం”, రాంచరణ్ “గేమ్ చేంజర్”  ఈ సినిమాలన్నీ ఇప్పుడు థమన్ గుప్పెట్లో ఉన్నాయి.  అయితే ప్రస్తుతం గేమ్ చేంజర్, గుంటూరు కారం నుంచి సాంగ్స్ రావాల్సి ఉంది.  ఈ మధ్యకాలంలో లీకులు బెడదా ఎక్కువైపోయిన విషయం తెలిసిందే.  అలానే రీసెంట్ గా గుంటూరు కారం నుంచి ఒక సింగిల్ సాంగ్ లీక్ అయింది.

ఆ సింగిల్ సాంగ్ పై ఇప్పుడు ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఇన్ని రోజులు వెయిట్ చేయించి ఈ పాట మీరు మాకు ఇచ్చేది అంటూ ఫ్యాన్స్ ట్రోల్స్  మొదలు పెట్టారు.  ఇంకొంతమంది అయితే పెళ్లిలో మైక్ సెట్ చేసే వాడిలా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ ల సౌండ్ డిజైనింగ్ చేయంటూ థమన్
వేసుకోవటం మొదలుపెట్టారు.  ఏదేమైనా సాంగ్ మాత్రం అభిమానులకు కొద్దిపాటి నిరాశనే మిగిల్చింది. మరి పూర్తి సాంగ్ వచ్చేంతవరకు అది ఏ మేరకు ఆకట్టుకుంటుందని ఇప్పుడే ఒక అంచనాకు రాలేము.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు