Peddha Kapu: పెదకాపు కి ఫుల్ స్టాప్ పడినట్లేనా.?

Peddha Kapu – 2

కొత్త బంగారులోకం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమాతో మంచి హిట్ అందుకుని వెంటనే మరోసారి మల్టీస్టారర్ సినిమాలకు తెర తీశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ను కాంబినేషన్ గా పెట్టి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అని ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ను తెరకెక్కించి ఆ సినిమాతో కూడా మంచి హిట్టు అందుకున్నాడు. ఆ సినిమా హిట్ తో మెగా హీరో వరుణ్ తేజ్ ను లాంచ్ చేసే అవకాశం దక్కించుకొని ముకుందా సినిమాతో కూడా మంచి హిట్ అందుకున్నాడు.

ఇక్కడ వరకు సాఫీగా సాగిన కెరియర్ బ్రహ్మోత్సవం సినిమాతో కొంచెం తలకిందులైంది. సూపర్ సార్ మహేష్ బాబు హీరోగా బ్రహ్మోత్సవం సినిమాని తెరకెక్కించిన శ్రీకాంత్ ఆ సినిమాతో డిజాస్టర్ అందుకొని కొన్నేళ్లపాటు దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. ఎట్టకేలకు తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేసి అమ్మ బాబోయ్ అడ్డాల అనిపించాడు.

బహుశా ఆ సినిమా ప్రభావంతోనే రీసెంట్గా పెదకాపు -1 అని ఒక రా అండ్ రస్టిక్ సినిమాని తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ స్పందనతో కొద్దిపాటి నిరాశనే మిగిలింది అని చెప్పొచ్చు. మొదట ఈ సినిమాను రెండు పార్ట్లుగా తీయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇప్పుడు మొదటి సినిమా ఫలితంతో ఈ సినిమా రెండో పార్ట్ వస్తుందా లేదా అనే సంశయంలో పడిపోయారు చాలామంది.
దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

ఇకపోతే ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ అయినా విరాట్ కర్ణకి మంచి మార్కులే పడ్డాయి. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో పాటు అన్నాయ్ అని ఒక సబ్జెక్ట్ చేస్తున్నట్టు ఇంతకుముందు అనౌన్స్ చేశాడు. ఈ తరుణంలో ఆ సబ్జెక్టు మళ్ళీ చేస్తాడా, డైరెక్టర్గా తన మార్క్ ని మరోసారి ప్రూవ్ చేసుకుంటాడా అని తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చూడక తప్పదు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు