Megastar Chiranjeevi : రీమేక్ ల రిజల్టే మెగాస్టార్ మార్పుకి కారణమా.?

Megastar Chiranjeevi  With Trivikram

మెగాస్టార్ తో సినిమా చేయాలని చాలామంది దర్శకులు కలలుగంటారు. కానీ ఆ కలలు కొంతమంది దర్శకుల విషయాల్లో మాత్రమే వాస్తవంగా మారుతాయి. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ లకి అవకాశం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే బాబి తో సినిమా చేసి వాల్తేరు వీరయ్య తో హిట్టు కొట్టిన మెగాస్టార్ ఇప్పుడు వశిష్టికి తనతో సినిమా చేసే అవకాశాన్ని కల్పించాడు. అలానే కళ్యాణ్ కృష్ణ, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో కూడా మెగాస్టార్ సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే మెగాస్టార్ తో సినిమా చేసే ప్రయత్నాలు దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎప్పటినుంచో చేస్తున్నట్లు మనకు తెలిసిన విషయమే.
ఒక రెండు మూడు సార్లు పూజ వరకు కూడా వెళ్లిన సినిమాలు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాను పూరి జగన్నాథ్ డీల్ చేయాలి. దానికి అప్పట్లో ఆటో జానీ అనే ఒక టైటిల్ని కూడా ఖరారు చేశారు. కానీ ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వలన పట్టాలెక్కలేదు. ఆ తరువాత ఆ సినిమా గురించి అసలు పత్తా లేదు.

ఇక అసలు విషయానికి వస్తే “వినయ విధేయ రామ” ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమాను చేస్తున్నట్లు, ఆ సినిమాను డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నట్లు, ఈ కాంబినేషన్ ని రామ్ చరణ్ తేజ్ సెట్ చేసినట్లు ఆయన చెప్పి సినిమాను అనౌన్స్ చేశారు. తరువాత ఆ సినిమా విషయంలో ఇప్పటివరకు ప్రస్తావన రాలేదు. బహుశా రీమేక్ సినిమాలు ఇచ్చిన రిజల్ట్ వలన డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది.

- Advertisement -

ఈ ప్రాసెస్ లోనే త్రివిక్రమ్ తో సినిమా కూడా పట్టాలెక్కపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నట్లు ఇదివరకే అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇకపోతే అల్లు అర్జున్ ఇప్పుడు పుష్పా సినిమాతో బిజీగా ఉన్నాడు ఆ సినిమా అయిపోయిన తర్వాత అట్లీతో చేసే ఆలోచనలో కూడా ఉన్నాడు. ఒకవేళ అట్లితో అల్లు అర్జున్ ముందుకెళ్తే త్రివిక్రమ్ కి బోలెడు టైం దొరుకుతుంది. ఈలోపు చిరంజీవితో సినిమా ఫినిష్ చేయొచ్చు. ఎప్పటినుంచో అనుకుంటున్నా ఈ సినిమా ఈసారి త్రివిక్రమ్ కి వర్కౌట్ అయ్యేటట్టే ఉంది అని అనిపిస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు