MissShetty MrPolishetty: పొలిశెట్టి నెట్ ఫ్లిక్స్‌కి వచ్చేసింది

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వన్ నేనొక్కడినే వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన నవీన్ పోలిశెట్టి, “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా రైటర్ గా కూడా తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు నవీన్. ఈ సినిమా తర్వాత అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమాతో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

జాతి రత్నాలు తర్వాత రీసెంట్ గా వచ్చిన “మిస్టర్ శెట్టి మిసెస్ పోలిశెట్టి” సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మహేష్ బాబు పి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. “మిస్టర్ శెట్టి మిసెస్ పోలిశెట్టి” సినిమాని తన భుజాల పైన వేసుకొని ప్రమోట్ చేశాడు నవీన్.

అనకాపల్లి నుంచి అమెరికా వరకు ప్రేక్షకులకు చేరువయ్యేలా ఈ సినిమాను ప్రమోట్ చేశాడు. “మిస్టర్ శెట్టి మిసెస్ పోలిశెట్టి” సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు కూడా ఈ సినిమాను అత్యద్భుతంగా ఆదరించారు. మంచి రివ్యూస్ తో పాటు మంచి మౌత్ టాక్ కూడా ఈ సినిమా సొంతం చేసుకొని విజయం వైపు దారి తీసింది.

- Advertisement -

ఈ సినిమాలో నవీన్ కనిపించిన విధానం, కామెడీ టైమింగ్, ఎమోషన్ అన్ని బాగా వర్కౌట్ అయి మంచి రిజల్ట్ తీసుకొచ్చాయి. ఇకపోతే ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫిక్స్ లో అందుబాటులో ఉంది. థియేటర్లో మిస్సయిన వాళ్ళు అంతా నెట్ ఫ్లిక్స్ లో ఈ మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ చూసేయండి.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు