Leo: లియో సెన్సార్ పూర్తి

#LEO CENSORED

ఈమధ్య రిలీజ్ కాబోయే సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా అంటే లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా చేస్తున్న సినిమా లియో. ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ఇంతకుముందు లోకేష్ నుంచి వచ్చిన సినిమాలు అని చెప్పొచ్చు.

కమలహాసన్ తో విక్రమ్ సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు లోకేష్. ఈసారి ఎంత భారీ హిట్ ఇస్తాడని చాలామంది సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇదివరకే మాస్టర్ సినిమాతో విజయ్ కి మంచి హిట్ అందించిన లోకేష్, ఈసారి విజయ్ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -

ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జ లాంటి పెద్ద పెద్ద నటులు నటిస్తున్నారు. విజయ్ కి జోడిగా త్రిష ఈ సినిమాలో కనిపించనుంది. ఇకపోతే ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి యు / ఏ సర్టిఫికెట్ దక్కినట్టు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ వేదిక పంచుకున్నాడు ఈ సినిమా ట్రైలర్ కోసం సర్వత్ర వెయిట్ చేస్తున్నారు నేడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు