Guntur Karam: థియేటర్లు తగలపడిపోయే పోయే సాంగ్ వస్తోంది

Guntur Karam First Single

త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా ఎన్నెన్నో మార్పులు జరుగుతూ ఇప్పుడుకి షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో అవంతరాలు, మహేష్ బాబు జీవితంలో వ్యక్తిగత ఒడిదుడుకులు చాలా జరుగుతూ, ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది.

ముందుగా సమ్మర్ కి రిలీజ్ చేస్తాం అనుకున్న ఈ సినిమాని సంక్రాంతికి పోస్టుపోన్ చేశారు. ఇప్పటికీ కూడా ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని చాలామందికి నమ్మకం లేక, కొన్ని సినిమాలను సంక్రాంతి రిలీజ్ డేట్ లకు ఫిక్స్ చేశారు. కానీ ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అని నిర్మాత నాగ వంశీ కన్ఫామ్ చేశాడు. అంతేకాకుండా సినిమా రిలీజ్ కి 100 రోజులు ఉందని అఫీషియల్ గా పోస్టర్ను కూడా ప్రొడక్షన్ నుంచి రిలీజ్ చేశాడు.

ఇకపోతే ఇప్పటికీ ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లిమ్స్ అన్ని అభిమానుల్ని ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పాట కోసం ఇప్పటికే ఫాన్స్ తో పాటు ఆడియన్స్ వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా పాట గురించి ఒక క్రేజీ అప్డేట్ ను హీరో సిద్దు జొన్నలగడ్డ రివిల్ చేశాడు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన సిద్దు మాట్లాడుతూ నిర్మాత చిన్న బాబు గారు తో ఇప్పుడే మాట్లాడానని, ఆయన గుంటూరు కారం సాంగ్ షూటింగ్ నుంచి వస్తున్నట్లు తెలిపాడు.

- Advertisement -

చిన్న బాబు గారి కళ్ళల్లో అంత ఆనందం ఆ మాటల్లో ఎగ్జిట్ మెంట్ తను ఎప్పుడూ చూడలేదని చెప్తూ గుంటూరు కారం సాంగ్ రేపు రిలీజ్ అయిన తర్వాత థియేటర్లు తగలబడిపోతాయని తన మాటల్లో చెప్తూ వచ్చాడు సిద్దు. ఏదేమైనా ఈ అప్డేట్ అనేది ఇప్పుడు ఫాన్స్ లో సరికొత్త జోష్ నింపుతుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు