RanbeerKapoor: అనిమల్ ప్రమోషన్లు.. వంద కోట్లే టార్గెట్!

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన “అనిమల్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ఫస్ట్ లుక్ తోనే బాలీవుడ్ లో ఓ రేంజ్ అంచనాలు పెంచిన ఈ చిత్రం, గ్లిమ్ప్స్, ఇంకా టీజర్ తో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. దానికి కారణం సందీప్ వంగ డైరెక్షన్ స్టైల్ కాగా, దానికి తగ్గట్టు సినిమా మార్కెటింగ్ అని కూడా చెప్పొచ్చు. డిసెంబర్ 1న అనిమల్ రిలీజ్ అవుతుండగా ప్రమోషన్లు జోరందుకున్నాయి.

ఇక సందీప్ రెడ్డి డైరెక్టర్ అవడం వల్ల అనిమల్ సినిమాని తెలుగు లో స్పెషల్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా తాజాగా ఆనిమల్ ప్రమోషన్ల కొరకు నందమూరి బాలకృష్ణ “అన్ స్టాపబుల్” ప్రోగ్రాం కి రణబీర్ కపూర్ సహా, రష్మిక మందన్న, సందీప్ రెడ్డి వంగ రావడం జరిగింది. ఇక ఒకప్పుడు తెలుగులో సినిమాలు రిలీజ్ చేసినా, ప్రమోషన్ల కోసం టాలీవుడ్ కి రాని బాలీవుడ్ స్టార్లు, ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ వాల్యూ తెలుసుకుని ఇక్కడ కూడా తమ సినిమాలని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక రణబీర్ కపూర్ ఇంతకు ముందే బ్రహ్మాస్త్ర కోసం తెలుగులో ప్రమోషన్స్ చేయగా, ఇప్పుడు అనిమల్ కోసం మరో సారి వచ్చేసాడు. ఇక సందీప్ రెడ్డి చొరవతో తెలుగులో వంద కోట్ల వసూళ్లే లక్ష్యంగా తమ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అనిమల్ మేకర్స్. పైగా టాలీవుడ్ ఆక్టర్స్ కూడా పలువురు ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇక బాలీవుడ్ సినిమాల్లో జవాన్ సినిమా తెలుగులో అత్యధికంగా 70 కోట్ల వరకు వసూలు చేసింది. మరి “అనిమల్” తో వంద కోట్లు కొడదామని భావిస్తున్న మేకర్స్ ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు