Ranabir kapoor: ఆనిమల్ రిలీజ్ వెనుక అసలు మ్యాటర్ అదేనా?

Ranabir kapoor:

హిందీలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీస్ లో భారీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా “ఆనిమల్”. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు ఉండే పాజిటివ్ బజ్ ఏర్పడింది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా, ఏ స్టిల్ రిలీజ్ అయినా ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఆ మధ్యన టీజర్ అప్డేట్ చెప్తూ లుక్ చూపించకుండా రిలీజ్ చేసిన షార్ట్ గ్లింప్స్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో తెలిసిందే.

ఇక తాజాగా ఆనిమల్ టీజర్ అప్డేట్ చెప్పేసింది చిత్ర యూనిట్. వినాయక చవితి సందర్భంగా ఒక స్టిల్ రిలీజ్ చేస్తూ ఆనిమల్ అఫిషియల్ టీజర్ ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ రోజు యూట్యూబ్ వ్యూస్ రికార్డు బద్ధలేనని పలువురు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్ తర్వాత చేస్తున్న రెండో హిందీ సినిమా ఇది.

అయితే ఆనిమల్ సినిమా 2023 సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. ఏప్రిల్ నుండి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా జులై లో, ఆ తర్వాత ఆగష్టు 11 న అంటూ ఊరించి, ఇప్పుడు ఏకంగా డిసెంబర్ 1కి ఫిక్స్ చేసారు. అయితే దీనికి మెయిన్ రీసన్ సినిమా షూటింగ్ ఆలస్యం కావడమే అని అంటున్నారు మేకర్స్. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ఆనిమల్ డైరెక్టర్ కి నిర్మాతలకి రెమ్యూనరేషన్ల విషయంలో అభిప్రాయం భేదాలు వచ్చాయని టాక్ నడుస్తుంది. ఇంకొందరు మాత్రం, అది డైరెక్టర్ తో కాదు హీరోతో అని అంటున్నారు. రెండింట్లో ఏది నిజమో కాదో తెలియదు గాని, ఆడియన్స్ మాత్రం బాలీవుడ్ నుండి రాబోతున్న సినిమాల్లో ఈ ఒక్క దానిపై మాత్రం భారీ ఎక్సయిట్ మెంట్ తో ఉన్నారు.

- Advertisement -

ఇక రణబీర్ సింగ్ ఈ సినిమాలో మోస్ట్ యాంగ్రీ మ్యాన్ గా కనిపిస్తున్నాడని సమాచారం. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. అయితే వాళ్ళ పాత్రలు సినిమాకి ఎంతో కీలకం కాబట్టి చిత్ర యూనిట్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఇక ఆనిమల్ సినిమాను డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు