Box Office: మార్క్ ఆంటోనీ.. విశాల్ కెరీర్ బెస్ట్..

Box Office

కోలీవుడ్ హీరో విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం మార్క్ ఆంటోనీ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. గ్యాంగ్ స్టర్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా ఆ జోనర్ లో వచ్చిన డిఫరెంట్ సినిమా గా పూర్తి స్థాయి కామెడీ డ్రామాగా తెరకెక్కింది. విశాల్ తో పాటు, ఎస్.జె. సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించగా, రీతూ వర్మ, అభినయ హీరోయిన్లు గా నటించడం జరిగింది.

సెప్టెంబర్ 15న రిలీజ్ అయిన మార్క్ ఆంటోనీ మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా ఆడుతుంది. విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం, తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవనుందని అనిపిస్తుంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లో మార్క్ ఆంటోనీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇంకా తెలుగు రాష్ట్రాలతో కలిపి, వరల్డ్ వైడ్ గా 42.50కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక సోమవారం నాడు వినాయక చవితి పండగ అడ్వాంటేజ్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మరో సారి రచ్చ చేసే అవకాశం ఉంది.

ఈ సినిమాలో ఎస్. జె.సూర్య కామెడీ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలవగా, మార్క్ ఆంటోనీ కి చేసిన ప్రమోషన్లు కూడా బాగా ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి 60కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయొచ్చని అంచనా. అయితే తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ కి ఇంకా 4కోట్ల వరకు రావాల్సి ఉంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు