Mark Antony: పెద్దగా కంటెంట్ లేకపోయినా అదరగొడుతుంది!

Mark Antony:

టాలీవుడ్ లో ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాకపోయినా, ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ అయిందే. అదే విశాల్ హీరోగా నటించిన ‘మార్క్ ఆంటోని’. తమిళ్ స్టార్ విశాల్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఎస్.జె. సూర్య సెకండ్ లీడ్ గా, సునీల్, అభినయ, రీతూ వర్మ, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 15న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా గ్యాంగస్టర్స్ నేపథ్యంలో తెరకెక్కినప్పటికీ, కామెడీ జోనర్ లో సినిమాని నడిపించారు. అందువల్ల కథ పరంగా అంతగా ఆసక్తిగా లేకపోయినా, కామెడీ బాగుండడంతో కలెక్షన్లు బాగా వస్తున్నాయి.అయితే ట్రైలర్ ని చూసినప్పుడే చాలా మంది ఆడియన్స్ కి సినిమాపై డౌట్ వచ్చింది. కానీ ఎంటరైన్మెంట్ బాగుండడంతో మార్క్ ఆంటోనీ కి ఆడియన్స్ ఓటేస్తున్నారు. ముఖ్యంగా ఎస్.జె. సూర్య కామెడీ సినిమాకి మేజర్ ప్లస్ గా నిలిచింది.

ఇక మార్క్ ఆంటోనీ రిలీజ్ అయిన రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర కోట్ల గ్రాస్ రాబట్టగా, తమిళనాడు, కేరళ తో పాటు వరల్డ్ వైడ్ గా 25కోట్లకి పైగా వసూలు చేసిన మార్క్ ఆంటోనీ ఆదివారం సెలవు రోజుతో మరో పది కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఓవరాల్ గా మార్క్ ఆంటోనీ ఫస్ట్ వీక్ 50కోట్ల వరకు వసూలు చేయొచ్చు. ఇక విశాల్ కి అభిమన్యుడు తరువాత ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్ లో కాకపోయినా, ఓ మాదిరిగా మంచి వసూళ్లే రాబడుతుందని చెప్పవచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు