Pushpaka Vimanam: రీరిలీజ్ కి రెడీ అవుతున్న క్లాసిక్ సినిమా..!

Pushpaka Vimanam

సినిమా బిగినింగ్ డేస్ లో డైలాగ్స్ లేకుండా మూకీ స్టైల్ లో ఉండేది. ఆ తర్వాత డబ్బింగ్ స్టార్ట్ అయ్యింది. డబ్బింగ్ మూవీస్ స్టార్ట్ అయ్యాక కూడా  సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ అప్పట్లో ఓక మూకీ సినిమా తీసాడు.ఆ సినిమానే పుష్పక విమానం. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ అయ్యింది.

ఆ సినిమాను ఇప్పుడు రీరిలీజ్ చేస్తున్నట్లు రాజ్ కమల్ ఫిలిమ్స్ అనౌన్స్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా రీరిలీజ్ చేయటం హర్షణీయం. ఈ జెనరేషన్ కి ఇలాంటి క్లాసిక్ మూవీ ఎక్స్పీరియన్స్ చాలా అవసరమని చెప్పాలి.

ఒకరోజు రాజు అనే కథ ఆధారంగా ఒక నిరుద్యోగి జీవితంలో జరిగే సంఘటనలతో కామెడీ ప్రధానంగా ఈ సినిమాను రూపొందించాడు సింగీతం.ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. పుష్పక విమానం సినిమా వచ్చాక ఇదే తరహాలో ఒకటి రెండు సైలెన్స్ సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా రేంజ్ లో హిట్ అవ్వలేకపోయాయి.

- Advertisement -

అప్పట్లో 35లక్షల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా సుమారు కోటి రూపాయల వరకు వసూళ్లు రాబట్టింది. కమల్ సరసన అమల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్ అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తర్వాత నాయకుడు సినిమాను కూడా రీరిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి, ఎవరు ఊహించని విధంగా రీరిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఈ జెనరేషన్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు