Razakar: విమోచన దినోత్సవం సందర్భంగా రజాకార్ టీజర్!

Razakar teaser:

టాలీవుడ్ లో తెలంగాణ నేపథ్యంలో ఇప్పుడు చాలా సినిమాలే వస్తున్నా, చారిత్రక నేపథ్యంలో వచ్చిన చిత్రాలు తక్కువ. మా భూమి, కొన్నేళ్ళకిందట వచ్చిన రుద్రమ దేవి, అలాగే పలు ఫిక్షనల్ స్టోరీస్ తో కూడిన రాజన్న లాంటి సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు తెలంగాణ నిజాం ప్రభుత్వ కోణంలో, అప్పటి రజాకార్లు ప్రజలను ఎలాంటి చిత్ర హింసలకు గురి చేశారన్న కోణంలో వస్తున్న సినిమా “రజాకార్”. ఈ చిత్ర అఫిషియల్ టీజర్ ని ఈరోజు ఎమ్మెల్యే రాజాసింగ్ అతిథిగా విచ్చేసి లాంచ్ చేయడం జరిగింది.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చేసారు. రజాకార్ మూవీ టీమ్ డైరెక్టర్ తో పాటు, నటీనటులు పాల్గొనడం జరిగింది. టీజర్ ని ఒక్కసారి గమనించగా, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన టైం లో తెలంగాణ లో జరిగిన అరాచకాలను ఈ టీజర్ లో కళ్ళకి కట్టినట్టు చూపించడం జరిగింది. టీజర్లో మెయిన్ లీడ్స్ ను ఎక్కువగా చూపించకపోయినా, కథ నేపథ్యం ఏంటో చెప్పడం జరిగింది.

ఆ రోజుల్లో రజాకార్ల వల్ల జరిగిన మాత మార్పిడి, ప్రజల్ని చిత్ర హింసలకు గురి చేసిన విధానం, అలాగే పిల్లల మర్రి ఊచకోత, అంశాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇప్పటివరకు తెలంగాణ సాంస్కృతిక వైభవం మీదనే ఎక్కువ సినిమాలు రాగా, ఇప్పుడు తెలంగాణలో నిజాం ప్రభుత్వ అరాచకాలపై వస్తున్న సినిమా కావడంతో తెలుగు ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా రజాకార్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.

- Advertisement -

టీజర్ కి భీమ్స్ అందించిన బీజీఎమ్ డీసెంట్ గా ఉండి ఆకట్టుకుంది. అయితే నిర్మాణ విలువలు అంత రిచ్ గా లేనట్లు అనిపిస్తుంది. ఇక సినిమాలో బాబి సింహా, వేదిక ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ సినిమాకు పాటలు రాస్తున్నారు.

అయితే తెలంగాణ రజాకార్ల నేపథ్యంలో రాబోతున్న మొదటి సినిమా ఇదే నని డైరెక్టర్ సత్యనారాయణ చెప్పడం జరిగింది. సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ లో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ సినిమా 2024లో రిలీజ్ కానుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు