GameChanger: అన్ని పక్కనపెట్టి బుచ్చిబాబుతో మొదలెట్టమని చరణ్ కి రిక్వెస్టులు?

టాలీవుడ్ లో టాప్ హీరోలందరి ఫ్యాన్స్ కి ఈ ఇయర్ మంచి మంచి అప్డేట్స్ అందుతుండగా, అందరూ తమ తమ సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ దేవర తో, అల్లు అర్జున్ పుష్ప2 తో, ప్రభాస్ సలార్ షూట్ లో, మహేష్ గుంటూరు కారం సెట్స్ లో బిజీ గా గడిపేస్తున్నారు. ఇక పవన్ గురించి తెలిసిందే. ఇక మిగిలిన టాప్ హీరో రామ్ చరణ్ ఒక్కడే.

గత రెండేళ్ల నుండి రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ, ఆ సినిమా నుండి ఫస్ట్ లుక్ మినహా ఇప్పటివరకు ఒక్క టీజర్ కూడా రాలేదు. ఇక రాక రాక దీపావళికి సాంగ్ రిలీజ్ చేస్తున్నామని ఆశ పెట్టి, మళ్ళీ వాయిదా వేసి ఫ్యాన్స్ కి నిరాశని మిగిల్చారు. ఇక చిర్రెత్తిపోయిన చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దిల్ రాజుని ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు. అటు శంకర్ ని కూడా ఇండియన్2 చేస్తున్నందుకు ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

అయితే “గేమ్ ఛేంజర్” గురించి వెయిట్ చేసి విసిగిపోయిన చరణ్ ఫ్యాన్స్ ఇక ఓపిక లేక రామ్ చరణ్ ని బుచ్చిబాబు తో సినిమా తీయమని రిక్వెస్ట్ చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే దిల్ రాజు తన సంక్రాంతి సినిమాలపై దృష్టి పెట్టగా, శంకర్ ఇండియన్2 పై ఫోకస్ పెట్టాడు. ఈ నవంబర్ లాస్ట్ వీక్ నుండి గేమ్ ఛేంజర్ షూట్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నా, ఇండియన్2 రిలీజ్ అయ్యే వరకు శంకర్ గేమ్ ఛేంజర్ ని ముట్టడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

- Advertisement -

అయితే బుచ్చిబాబు ఖాళీగా ఉన్నాడు కాబట్టి, ఇండియన్2 రిలీజ్ అయ్యే లోపు బుచ్చిబాబు తో సినిమా స్టార్ట్ చెయ్యమని, సోషల్ మీడియా లో రామ్ చరణ్ ట్యాగ్ చేస్తూ రిక్వెస్టులు పెడుతున్నారు చరణ్ ఫ్యాన్స్. రామ్ చరణ్ కి ఇది మరో రంగస్థలం అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి రామ్ చరణ్ బుచ్చిబాబు ల సినిమా ఎప్పుడు మొదలవుతుందోనని చరణ్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు